300 సంవత్సరాల క్రితం తప్పిపోయిన మహిళ.. దెయ్యమై కనిపించింది.. ఎక్కడ?
300 సంవత్సరాల క్రితం తప్పిపోయిన మహిళ.. దెయ్యమై కలకలం రేపింది. ఆ దెయ్యం యూకే జాతీయ సంపదైన ఆక్స్‌బర్గ్ హాల్‌లో ప్రత్యక్షమైంది. టెక్నాలజీ పెరుగుతున్నా.. దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన వివరాలు రోజుకొకటి నెట
300 సంవత్సరాల క్రితం తప్పిపోయిన మహిళ.. దెయ్యమై కలకలం రేపింది. ఆ దెయ్యం యూకే జాతీయ సంపదైన ఆక్స్‌బర్గ్ హాల్‌లో ప్రత్యక్షమైంది. టెక్నాలజీ పెరుగుతున్నా.. దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన వివరాలు రోజుకొకటి నెట్లో దర్శనమిస్తున్నాయి. ఇదే కోవకు చెందిన ఓ ఘటన యుకేలోని నార్విచ్‌లో జరిగింది. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఆక్స్‌బర్గ్ హాల్ రాణీ ఎలిజిబెత్-I కాలంలో ఈ కోటా క్రిస్టియన్ మతపెద్దలకు ఆతిథ్య భవనంగా ఉండేదట. 300 వందల సంవత్సరాల క్రితం ఓ మహిళ హాల్ నుంచి తప్పిపోయిందని, ఆ మహిళే దెయ్యంగా తిరుగుతోందని ప్రచారంలో ఉంది. తాజాగా 46 ఏళ్ల వయసున్న "డయానా బెరోన్" అనే మహిళ అనుకోకుండా తీసిన ఓ ఫోటోలో దెయ్యంగా కనిపించింది.
ఒక జంట హాల్ బ్రిడ్జ్‌పై మాట్లాడుకుంటుండగా జంటకు ఎదురుగా ఓ మహిళ కనిపిస్తోంది. ఫోటోలో పేర్కొంటున్న దెయ్యం ఆకారం మొహం నల్ల రంగులో కనబడుతోంది. గోడకు ఆనుకుని నిలుచున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ కోటలో దెయ్యం ఉందనే వాదన చాలా కాలం నుంచి ఉంది. ఈ ఫోటో నెట్‌లో వైరల్ అయ్యింది. ఇదంతా నిజమేనని ఫోటోకు ముందు అక్కడెవరూ నిలబడలేదని చెప్పింది. అయితే ఈ ఫోటోపై విభిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.