Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా నగ్న ఫోటోలను ఫేస్‌బుక్ పోస్ట్ చేసింది... నష్టపరిహారం చెల్లించాల్సిందే : ఐర్లాండ్ బాలిక

ఐర్లాండ్‌కు చెందిన 14 యేళ్ళ బాలిక ఒకరు.. సోషల్ మీడియా ఫేస్‌బుక్‌పై కోర్టుకెక్కింది. తన నగ్నఫోటోలను ఫేస్‌బుక్ పోస్ట్ చేసి తన పరువు తీసిందనీ అందువల్ల తనకు భారీ మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలంటూ డిమాండ్

Advertiesment
Ireland Girl
, గురువారం, 15 సెప్టెంబరు 2016 (12:46 IST)
ఐర్లాండ్‌కు చెందిన 14 యేళ్ళ బాలిక ఒకరు.. సోషల్ మీడియా ఫేస్‌బుక్‌పై కోర్టుకెక్కింది. తన నగ్నఫోటోలను ఫేస్‌బుక్ పోస్ట్ చేసి తన పరువు తీసిందనీ అందువల్ల తనకు భారీ మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన ఈ బాలిక, తన ఫోటోను అప్ లోడ్, రీ అప్ లోడ్‌కు 'ఫేస్ బుక్' అనుమతించిందంటూ మండిపడుతోంది. ఉత్తర ఐర్లాండ్ రాజధాని బెల్ ఫాస్ట్ హైకోర్టును బాధిత బాలిక ఆశ్రయించింది. ఇదే అంశంపై బాలిక తరపు న్యాయవాది మాట్లాడుతూ, ఒక వ్యక్తి ఆ బాలికను బ్లాక్ మెయిల్ చేసి నగ్నఫొటోను సంపాదించాడని, ఆ ఫొటోను ‘ఫేస్ బుక్’లో అప్‌లోడ్ చేశాడని పేర్కొన్నారు. 
 
ఇటువంటి ఫొటోలను బ్లాక్ చేయాల్సిన ‘ఫేస్ బుక్’ అధికారులు, ఆ విధంగా చేయలేదని అన్నారు. అదే ఫొటోను పలుసార్లు అప్ లోడ్ చేసినా పట్టించుకోలేదని, తన క్లయింట్ పరువుకు నష్టం కల్గించిన ‘ఫేస్ బుక్’ సంస్ధ పెద్ద మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలని బాలిక తరపు న్యాయవాది డిమాండ్ చేశారు. అయితే, ఈ ఆరోపణలను ఖండిస్తూ ‘ఫేస్ బుక్’ యాజమాన్యం చేసిన వాదనను హైకోర్టు కొట్టి వేసింది. ఈ కేసు విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెల్ఫీ లవర్స్‌కు శాడ్ న్యూస్.. విమానాల్లో ఎక్కేటప్పుడు సెల్ఫీలకు నో.. డీజీసీఏ