Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికన్లపై మేము కూడా నిషేధం విధిస్తాం.. ముస్లిం ప్రపంచాన్ని అవమానించడమే: ఇరాన్

తాము కూడా అమెరికన్లు తమ దేశంలోకి రాకుండా నిషేధం విధిస్తామని ఇరాన్ తీవ్రంగా మండిపడింది. ఏడు ముస్లిం మెజారిటీ దేశాలపై అమెరికా వీసా నిషేధం విధించడంపై ఇరాన్ తీవ్రంగా మండిపడింది. తాము కూడా అమెరికన్లు తమ దే

Advertiesment
Iran vows to bar Americans in response to Trump’s ‘insulting’ ban
, ఆదివారం, 29 జనవరి 2017 (10:46 IST)
తాము కూడా అమెరికన్లు తమ దేశంలోకి రాకుండా నిషేధం విధిస్తామని ఇరాన్ తీవ్రంగా మండిపడింది. ఏడు ముస్లిం మెజారిటీ దేశాలపై అమెరికా వీసా నిషేధం విధించడంపై ఇరాన్ తీవ్రంగా మండిపడింది. తాము కూడా అమెరికన్లు తమ దేశంలోకి రాకుండా నిషేధం విధిస్తామని ఆ దేశ విదేశాంగశాఖ ప్రకటించింది. ట్రంప్‌ నిర్ణయం చట్టవిరుద్ధం, తర్కరహితం అని ఆ దేశం ఆక్షేపించింది. 
 
ఇది ముస్లిం ప్రపంచాన్ని, ఇరాన్‌ను బహిరంగంగా అవమానించడమేనని ఇరాన్ పేర్కొంది. కాగా, ‘ఇది దేశాల మధ్య గోడలు కట్టాల్సిన సమయం కాదు. కొన్నేళ్ల క్రితమే బెర్లిన్‌ గోడ బద్దలైన విషయాన్ని ట్రంప్‌ మర్చిపోయినట్టున్నారు’ అని ఆ దేశ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ హితవు పలికారు.
 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ట్రంప్ జారీ చేసిన ఆదేశాలను బ్రూక్లిన్‌ ఫెడరల్ జడ్జి శనివారం రాత్రి నిలిపేశారు. ఈ మేరకు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. చెల్లుబాటయ్యే వీసాలతో అమెరికా చేరుకున్నవారిని అమెరికా ప్రభుత్వం దేశం నుంచి పంపించేయడాన్ని తాత్కాలికంగా అడ్డుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముస్లింలపై డొనాల్ట్ ట్రంప్ నిర్ణయం.. జుకెర్‌బర్గ్ ఫైర్.. సుందర్ పిచాయ్ ఆదేశాలు