Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భూమికి 3,80,000 కిలోమీటర్ల దూరంలో సురక్షితంగా చంద్రయాన్: నివ్వెరపోయిన నాసా

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు మరో శుభదినం. దాదాపు 7 సంవత్సరాల క్రితం ఇస్రోకు సంబంధాలు కోల్పోయిన మానవ రహిత అంతరిక్ష నౌక చంద్రయాన్-1 ఇప్పటికీ క్షేమంగానే ఉందని, సజావుగా పనిచేస్తోందని నాసా దిగ్భ్రాంతి కలిగంచే వార్త ప్రకటించింది.

Advertiesment
భూమికి 3,80,000 కిలోమీటర్ల దూరంలో సురక్షితంగా చంద్రయాన్: నివ్వెరపోయిన నాసా
హైదరాబాద్ , శనివారం, 11 మార్చి 2017 (01:42 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు మరో శుభదినం. దాదాపు 7 సంవత్సరాల క్రితం ఇస్రోకు సంబంధాలు కోల్పోయిన మానవ రహిత అంతరిక్ష నౌక చంద్రయాన్-1 ఇప్పటికీ క్షేమంగానే ఉందని, సజావుగా పనిచేస్తోందని నాసా దిగ్భ్రాంతి కలిగంచే వార్త ప్రకటించింది. ప్రయోగించిన తొమ్మిదేళ్ల తర్వాత కూడా ఈ నౌక చంద్రుని చుట్టూ 200 కిలోమీటర్ల పరిధిలో పరిభ్రమిస్తున్నట్లు కాలిఫోర్నియాలోని నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు భూమి ఆధారిత రాడార్ వ్యవస్థను ఉపయోగించి విజయవంతంగా గుర్తించారు. 2008 అక్టోబరు 22 న పంపిన చంద్రయాన్- 1‌తో 2009 ఆగస్టు 29 తర్వాత ఇస్రోకు సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే.

 
నాసా ప్రయోగించిన చంద్రుని స్థిర కక్ష్య నిఘాపర్యవేక్షణ నౌక (లూనార్ రికొనాయేషియన్స్ ఆర్బిటర్) తోపాటు ఇస్రోకు చెందిన చంద్రయాన్-1 కూడా చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్నట్లు భూ ఆధారిత రాడార్ వ్యవస్థ ద్వారా గుర్తించామని జేపీఎల్‌కు చెందిన ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్, శాస్త్రవేత్త మరినా బ్రోజోవిక్ తెలిపాడు. మెషీన్ నేవిగేటర్ సహాయంతో కక్ష్యలో ఎల్‌ఆర్ఓ పనితీరును సులభంగా గుర్తించామని, అలాగే 2009 ఆగస్టు నుంచి రాడార్‌కు సంకేతాలు నిలిచిపోయిన చంద్రయాన్-1 పనితీరు కూడా గుర్తించినట్లు బ్రోజోవిక్ తెలియజేశారు.మానవ రహిత నౌక చంద్రయాన్-1 పరిమాణం స్మార్ట్ కారులో సగం ఉంటుంది. దీని పొడవు, వెడల్పు, ఎత్తులు పరిమాణం 1.5 మీటర్లు ఉంటాయి.
 
అంతరగ్రహ రాడార్ సాయంతో భూమి నుంచి కొన్ని మిలియన్ మైళ్ల దూరంలో ఉన్న చిన్న గ్రహాలను గుర్తించవచ్చు. అయితే ప్రస్తుత పరిశోధన వాటిపై కాదని, కేవలం చంద్రుడిపై మాత్రమే అని ఆయన తెలిపారు. చంద్రయాన్-1 భూమి నుంచి 3,80,000 కిలోమీటర్ల దూరం ఉన్నట్లు జేపీఎల్ టీమ్ పంపిన శక్తివంతమైన మైక్రోవేవ్ కిరణాల ద్వారా గుర్తించారు. 
 
ఇస్రోతో సంబంధాలు తెగిపోయినప్పటికీ నేటికీ చంద్రయాన్-1 పనిచేస్తోందంటే మన అంతరిక్ష శాస్త్రజ్ఞులు నైపుణ్యం ఎంత ఖచ్చితత్వంతో ఉందో అర్థం చేసుకోవచ్చు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోత్కుపల్లి తెదేపాకు షాకిస్తారా...? కేసీఆర్‌తో మంతనాలేంటి?