ప్రతిసారీ ఆమే టార్గెట్.. ఈసారి బట్టలిప్పమన్నారు.. చెకింగ్ పేరుతో ఎన్నారై మహిళకు ఘోరావమానం
బెంగళూరు నుంచి ఐర్లండ్ వెళుతున్న భారతీయ మహిళను జర్మనీ లోని ఫ్రాంక్ ఫర్ట్ విమానాశ్రయంలో తనిఖీ పేరుతో ఘోరంగా అవమానించారు. ఎన్నోసార్లు ఆ మార్గంలో ప్రయాణించినా చెకింగ్ పేరుతో పూర్తిగా బట్టలు విప్పమని వేధించారు. జాతి వివక్షకు ఏమాత్రం తగ్గని ఈ ఘటనపై సమాచార
బెంగళూరు నుంచి ఐర్లండ్ వెళుతున్న భారతీయ మహిళను జర్మనీ లోని ఫ్రాంక్ ఫర్ట్ విమానాశ్రయంలో తనిఖీ పేరుతో ఘోరంగా అవమానించారు. ఎన్నోసార్లు ఆ మార్గంలో ప్రయాణించినా చెకింగ్ పేరుతో పూర్తిగా బట్టలు విప్పమని వేధించారు. జాతి వివక్షకు ఏమాత్రం తగ్గని ఈ ఘటనపై సమాచారం పంపాలని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ జర్మనీలోని భారతీయ రాయబార కార్యాలయాన్ని ఆదేశించారు.
ఐర్లండ్ లోని రెక్జావిక్‌లో నివసిస్తున్న శ్రుతి బసప్ప ఒక ఐర్లండ్ వాసిని పెళ్లాడింది. బెంగళూరు నుంచి భర్త, పాపతో కలిసి ఐర్లండ్ వెళుతున్న ఆమె ఈ దఫా ప్రయాణంలో తనకు కలిగిన బాధాకరమైన అనుభవాన్ని ఫేస్ బుక్‌లో పంచుకుంది. "మేం ఇండియా నుంచి ఐర్లండ్‌కు ప్రాంక్‌ఫర్ట్ మార్గంలో వెళుతున్నాం. ర్యాండమ్ చెకింగ్ చేయాలని, పక్కకు రావాలని ఫ్రాంక్ ఫర్ట్ విమానాశ్రయంలో అధికారులు ఎలాంటి వివరణలూ లేకుండా ఆదేశించారు. పక్క గదిలోకి తీసుకెళ్లాక నేను నా దుస్తుల్లోపల ఎలాంటి వస్తువులనూ ఉంచుకోలేదని నిర్ధారించుకోవడానికని నా బట్టలు విప్పేయాలని వారు ఆదేసించారు. ఇదంతా నా నాలుగేల్ పాప సమక్షంలో జరిగిందని శ్రుతి వాపోయింది.
విమానాశ్రయంలో పూర్తి బాడీ స్కానింగ్ చేసిన తర్వాత కూడా అధికారులు నన్ను పూర్తిగా బట్టలిప్పమన్నారు. ఇటీవలే నాకు పొత్తి కడుపు శస్త్రచికిత్స జరిగిందని అభ్యర్థించినా వారు వినలేదు. పైగా మినహాయింపులు కోరుతున్నందుకు పెద్దగా కేకలేశారు. అయినా నేను నా బట్టలు విప్పేందుకు తిరస్కరించాను. ఈలోగా నా ఐర్లండ్ భర్త నేనున్న గదిలోకి వెతుక్కుంటూ రావడంతో ఆ అధికారులు వెనక్కు జరిగారు అని శ్రుతి చెప్పారు.
ఈ ఉదంతం పట్ల నేను జాతి విద్వేష కార్డును ప్లే చేయడం అంటే నాకు అసహ్యం. కానీ అంతమంది ప్రయాణీకుల్లో వారు నన్నొక్కదాన్నే పక్కకు తీసుకుపోయారు. కానీ నా భర్తను చూడగానే నా బట్టలు విప్పి తనిఖీ చేయాలన్ని అధికారిణి మనసు మార్చుకుని సాధారణ తనిఖీ చేపట్టి వదిలిపెట్టిందని శ్రుతి వివరించింది.
అయితే సెక్యూరిటీ చెకింగ్ కోసం తనను పక్కకు తీసుకెళ్లడం ఇది తొలిసారికాదని, రాండమ్ చెకింగ్ కోసం ప్రతిసారీ నన్నే అధికారులు ఎంపిక చేసుకునేవారు శరీరాన్ని తడిమేవారు, లగేజీ తనిఖీ చేసేవారు. వేరే రూమ్ లోకి తీసుకెళ్లి మరీ శరీరాన్ని తడిమి తనిఖీ చేసేవారు కానీ బట్టలిప్పేయమనడం ఇదే తొలిసారి అంటూ శ్రుతి వాపోయారు. ఇలా ఒక్క వ్యక్తినే పట్టుకున దుస్తులువిప్పాలని కొత్త రూల్ పెట్టారేమో నాకు తెలీదు. కానీ ప్రతిసారీ వారు నన్నే ఎంపిక చేసి ప్రత్యేక తనిఖీ చేయండం చాలా బాధ కలుగించేది. ఈసారి నేరుగా బట్టలు విప్పమనేంతవరకు వ్యవహారం సాగిందని శ్రుతి చెప్పారు
పూర్తి బాడీ చెకింగ్ చేసిన తర్వాత కూడా ఎందుకు మళ్లీ దుస్తులు విప్పేయమని అడిగారో వివరణ ఇవ్వాలని ప్రాంక్ ఫర్ట్ విమానాశ్రయంలో భద్రతాధికారులపై శ్రుతి బసప్ప ఫిర్యాదు చేసింది కానీ ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. ఈ ఘటనపై సమాచారం పంపాలని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ జర్మనీలోని భారతీయ రాయబార కార్యాలయాన్ని ఆదేశించారు.