Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కెనడా రక్షణ శాఖామంత్రి భారత సంతతి మహిళ

కెనడా రక్షణ శాఖామంత్రి భారత సంతతి మహిళ
, బుధవారం, 27 అక్టోబరు 2021 (09:36 IST)
కెనడా రక్షణ శాఖామంత్రిగా భారత సంతతి మహిళ అనితా ఆనంద్ నియమితులయ్యారు. తన మంత్రవర్గాన్ని పునర్ వ్యవస్థీకరిస్తూ కెనడా దేశ ప్రధానమంత్రి  జస్టిన్ ట్రూడో నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఎంతో కీలకమైన రక్షణ శాఖ మంత్రిగా భారత సంతతి మహిళ అనితా ఆనంద్‌కు కేటాయించారు. 
 
ఇప్పటివరకు కెనడా రక్షణ మంత్రిగా భారత సంతతికే చెందిన హర్జీత్ సజ్జన్ కొనసాగారు. అయితే, సైన్యంలో లైంగిక వేధింపుల అంశానికి సంబంధించిన దర్యాప్తులో ఆయన వైఖరి పట్ల విమర్శలు వచ్చాయి. దాంతో ఆయనను రక్షణ శాఖ నుంచి తప్పించి ఆ బాధ్యతలు అనితా ఆనంద్‌కు అప్పగించడం గమనార్హం. 
 
54 ఏళ్ల అనితా ఆనంద్ కెనడాలోని ఓక్ విల్లే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కార్పొరేట్ లాయర్‌గా ప్రస్థానం ఆరంభించిన అనిత రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రజా సేవల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. దేశ ప్రజలకు వ్యాక్సిన్ అందించడంలో సమర్థంగా వ్యవహరించారన్న గుర్తింపు తెచ్చుకున్నారు.
 
అదేసమయంలో సజ్జన్‌‌ను అంతర్జాతీయ అభివృద్ధి శాఖ మంత్రిగా నియమించారు. జస్టిన్ ట్రూడో నాయకత్వంలోని లిబరల్ పార్టీ ఇటీవలే ఎన్నికలకు వెళ్లి విజయం సాధించి తిరిగి అధికారాన్ని దక్కించుకున్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బుధవారం తెల్లవారుజామున అండమాన్‌లో భూకంపం