Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ తెల్లవాళ్లకు ఏం పోయేకాలమొచ్చిందో.. మతబోధకులపైనా దాడులే..

అమెరికానే కాదు.. పాశ్చాత్య ప్రపంచం మొత్తంగా జాతి విద్వేష జ్వాలలో తగులబడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇన్నాళ్లూ అమరికాకే పరిమితమైన జాతి ఉన్మాదం ఇప్పుడు ఆస్ట్రేలియాకూ పాకింది. పొట్టకూటికోసం వచ్చిన బయటి దేశ

Advertiesment
ఈ తెల్లవాళ్లకు ఏం పోయేకాలమొచ్చిందో.. మతబోధకులపైనా దాడులే..
హైదరాబాద్ , సోమవారం, 20 మార్చి 2017 (09:52 IST)
అమెరికానే కాదు.. పాశ్చాత్య ప్రపంచం మొత్తంగా జాతి విద్వేష జ్వాలలో తగులబడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇన్నాళ్లూ అమరికాకే పరిమితమైన జాతి ఉన్మాదం ఇప్పుడు ఆస్ట్రేలియాకూ పాకింది. పొట్టకూటికోసం వచ్చిన బయటి దేశాల ఉద్యోగులనే కాదు. బయటి దేశాల మతబోధకులను కూడా వదలకుండా దాడులకు పాల్పడుతున్న ఈ విద్వేషాన్ని అరికట్టేది ఎవరు?
 
 
అమెరికాలో జరుగుతున్న విద్వేషదాడుల జాడ్యం ఆస్ట్రేలియాకు పాకింది. మెల్ బోర్న్ చర్చిలో భారత క్రైస్తవ మత ప్రచారకుడిపై 72 ఏళ్ల వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. జాత్యాంహకారంతోనే దాడి జరిగినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చర్చి ఫాదర్ రేవ టొమీ కళాథూర్ మాథ్యూ(48)పై దుండగుడు హఠాత్తుగా కత్తితో దాడి చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
 
భారతీయుడైన మాథ్యూ... హిందువు లేదా ముస్లిం అయుంటాడన్న కారణంతో దాడికి పాల్పడినట్టు నిందితుడు వెల్లడించాడు. ఉద్దేశపూర్వక దాడి, నిర్లక్ష్యంతో మరొకరి గాయాలకు కారణమయ్యారన్న ఆరోపణల కింద కేసు నమోదు చేశారు. బెయిల్ పై విడుదలైన అతడిని బ్రాడ్ మీడొస్ కోర్టులో జూన్ 13న హాజరుపరచనున్నారు. దాడిలో గాయపడ్డ మాథ్యూకు ప్రాణాపాయం తప్పింది. ఆస్పత్రిలో ఆయన కోలుకుంటున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆయనే ఓ వివాదాల పుట్ట... కానీ ఇకపై వద్దంటున్నారు.. ఆహా రాజకీయమా..!