Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మూడేళ్ల ప్రాయంలో తల్లికి దూరమైంది.. 44వ ఏట కన్నతల్లికి చేరువైంది.. ఎలా?

మూడేళ్ల ఏళ్ల ప్రాయంలో కన్నతల్లికి దూరమై.. విదేశాలకు వెళ్ళిపోయిన కుమార్తె... 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం కన్నతల్లిని కలుసుకుంది. ఆమె భారత సంతతికి చెందిన స్వీడెన్ యువతి నీలాక్షి ఎలిజబెత్ జోరెండాల్.

మూడేళ్ల ప్రాయంలో తల్లికి దూరమైంది.. 44వ ఏట కన్నతల్లికి చేరువైంది.. ఎలా?
, గురువారం, 15 జూన్ 2017 (14:05 IST)
మూడేళ్ల ఏళ్ల ప్రాయంలో కన్నతల్లికి దూరమై.. విదేశాలకు వెళ్ళిపోయిన కుమార్తె... 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం కన్నతల్లిని కలుసుకుంది. ఆమె భారత సంతతికి చెందిన స్వీడెన్ యువతి నీలాక్షి ఎలిజబెత్ జోరెండాల్. వివరాల్లోకి వెళితే.. 1973లో మహారాష్ట్రకు చెందిన యవాత్మల్ అనే మహిళకు ఎలిజబెత్ అనే అమ్మాయి పుట్టింది. యవాత్మల్‌ భర్త చనిపోవడంతో వ్యవసాయ కూలీ పనులు చేసుకుని జీవించే యవాత్మల్.. పాపకు మూడేళ్ల వయసున్న సమయంలో పుణే సమీపంలోని కెడ్గావ్‌లో ఉన్న పండిత రమాబాయి ముక్తి మిషన్ అనాథశ్రమంలో వదిలి వెళ్లింది.
 
ఆ పాపను ఓ స్వీడెన్ జంట దత్తత తీసుకుంది. 1976లో దత్తత తల్లిదండ్రులు పాపను స్వీడన్ తీసుకెళ్లిపోయారు. ఎలిజబెత్ అని పేరు పెట్టారు. 1990లో తొలిసారిగా ఎలిజబెత్‌కు ఆమె కన్నతల్లి గురించి చెప్పారు. అదే ఏడాది 17ఏళ్ల వయసులో పుణేకి వచ్చిన ఎలిజబెత్.. తల్లి గురించి ఆరా తీసింది. కానీ ఎక్కడా ఆమె ఆచూకీ దొరకలేదు. చివరికి 44 ఏళ్ల వయస్సులో కన్నతల్లికి చేరువైంది. 
 
పుణేకు చెందిన ఓ ఎన్జీవో సంస్థ సాయంతో గత శనివారం అనారోగ్యం కారణంగా ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యవాత్మల్‌ను ఎలిజబత్ కలుసుకుంది. తల్లిని చూసిన ఆనందంలో కన్నీటి పర్యంతమైంది.
 
కాగా, ఎలిజబెత్‌ను అనాథశ్రమంలో వదిలిన తర్వాత యవాత్మల్ మరో వివాహం చేసుకోగా.. ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. తల్లితో పాటు చెల్లి, తమ్ముడి బాధ్యతను కూడా ఇప్పుడు తానే తీసుకుంటానంటుంది ఎలిజబెత్ వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోమాతను హోదా చిహ్నంగా భావించి తినేవారిని ఉరితీయాలి : సాధ్వీ సరస్వతి