Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎల్ఓసీ నిబంధనలు ఉల్లంఘించి పీవోకేలో దాడి చేస్తాం : పాక్‌కు తేల్చి చెప్పిన భారత్

ఉగ్రవాదుల ఏరివేత విషయంలో భారత్ తన విస్పష్ట వైఖరిని తేల్చిచెప్పింది. ఇకపై ఏ చిన్నపాటి ఉగ్రదాడి జరిగినా సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. అంతేకాదండోయ్.. అంతర్జాతీయ సరిహద్దు నిబంధనలు ఉల్లఘించి మరీ..

ఎల్ఓసీ నిబంధనలు ఉల్లంఘించి పీవోకేలో దాడి చేస్తాం : పాక్‌కు తేల్చి చెప్పిన భారత్
, సోమవారం, 10 అక్టోబరు 2016 (11:57 IST)
ఉగ్రవాదుల ఏరివేత విషయంలో భారత్ తన విస్పష్ట వైఖరిని తేల్చిచెప్పింది. ఇకపై ఏ చిన్నపాటి ఉగ్రదాడి జరిగినా సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. అంతేకాదండోయ్.. అంతర్జాతీయ సరిహద్దు నిబంధనలు ఉల్లఘించి మరీ.. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి అడుగుపెట్టి ఉగ్రవాదుల అంతమొదిస్తామని పాకిస్థాన్‌కు పునరుద్ఘాటించింది. ఇది పాకిస్థాన్‌కు ఏమాత్రం మింగుడు పడని అంశంగా మారింది. 
 
యురీ ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదులపై, తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌పై భారత్ వైఖరి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా పాక్ వైపు నుంచి చొరబాట్లు ఆగని పక్షంలో, భారత్ వైపు నుంచి కూడా చొరబాట్లు చేసే హక్కు తమకుందని వెల్లడించినట్టు సమాచారం. 2004 అప్పటి పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్, తమ భూభాగం వేదికగా భారత్‌పై ఉగ్రదాడులకు సహకరించబోమని అధికారిక ప్రకటన చేశారు. 
 
అయితే, ఈ ప్రకటన పత్రికలకే పరిమితమైంది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాక్ గ్రామాల నుంచే చొరబాట్లు జరుగుతున్నాయని, వీటిని పాక్ సైన్యం దగ్గరుండి ప్రోత్సహిస్తూ, ఆపై వారు జరిపే మారణకాండను చూస్తోందని భారత్ ఆరోపిస్తోంది. అయితే, ఇకపై అలా జరగనివ్వబోమని పాక్‌కు తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది.
 
ఇక ఎవరైనా దాడి చేస్తే తమను తాము రక్షించుకుంటూనే దేశాన్ని కాపాడగల శక్తి సామర్థ్యాలను పుష్కలంగా కలిగివున్న భారత సైన్యం, ఇకపై ఆ ప్రమాదం జరిగేంత వరకూ వేచి చూడకుండా, ముందుగానే నివారించే మార్గలను అన్వేషించాలన్న వ్యూహానికి మారుతోందని ప్రభుత్వ ఉన్నత వర్గాలు పేర్కొన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న శశికళ.. జయలలిత అనారోగ్యమే కారణం!