Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇస్రోకు దెబ్బ.. బిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాల్సిందేనా? మన్మోహన్ సర్కారే కారణమా?

అంతరిక్షంలోకి పలు అత్యాధునిక శాటిలైట్లను ప్రయోగిస్తూ.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాల సరసన చేరిపోయిన ఇస్రోకు కొత్త తలనొప్పి వచ్చిపడింది. అంతర్జాతీయ ఇన్వెస్టర్ నుంచి శాటిలైట్ ఒప్పందాన్ని రద్దుచేసుకున్న క

Advertiesment
India
, మంగళవారం, 26 జులై 2016 (17:52 IST)
అంతరిక్షంలోకి పలు అత్యాధునిక శాటిలైట్లను ప్రయోగిస్తూ.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాల సరసన చేరిపోయిన ఇస్రోకు కొత్త తలనొప్పి వచ్చిపడింది. అంతర్జాతీయ ఇన్వెస్టర్ నుంచి శాటిలైట్ ఒప్పందాన్ని రద్దుచేసుకున్న కేసులో భారత్‌కు చుక్కెదురైంది. ఈ కేసుపై విచారించిన అంతర్జాతీయ ట్రైబ్యునల్ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు నివ్వడం ద్వారా భారత్ బిలియన్ డాలర్ల మేర నష్ట పరిహారం చెల్లించాల్సి వుంటుంది. 
 
కాగా ఇస్రో ప్రధాన కార్యాలయంగా పనిచేసే స్పేస్ కంపెనీ ఆంట్రిక్స్ ఈ మేరకు రెండు ఉపగ్రహాలు, ఎస్ బ్యాండ్ స్పెక్ట్రమ్ కొనేందుకు దీవాస్ మల్టీమీడియా సంస్థతో ఒప్పందం చేసుకుంది. అయితే 2005లో ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో దీవాస్ సంస్థ భారీగా నష్టపోయింది. 
 
ఇస్రో ఛైర్మన్ మాధవన్ నాయర్ నాయకత్వంలో ఈ ఒప్పందంపై దీవాస్ సంతకాలు చేసిందని, ఆంట్రీక్స్ దాదాపు 12 ఏళ్లకు రూ.600 కోట్లు చెల్లించిందని విచారణలో తెలియవచ్చింది. దీంతో 2015లో ఆంట్రిక్స్‌పై అంతర్జాతీయ ట్రైబ్యునల్‌లో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం.. భారత ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేసుకోవడాన్ని తప్పుబడుతూ జరిగిన నష్టానికి బిలియన్ డాలర్లు చెల్లించాలని తీర్పునిచ్చింది.

కానీ గత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మాత్రం ఈ ఒప్పందం కుదరలేదని, ఇస్రో శాటిలైట్లను అప్పటికే రూపొందించే పనుల్లో ఉందని చెప్తోంది. అయితే  2జీ స్కామ్ వెలుగులోకి రావడంతో ఈ ఒప్పందం మూలన పడిందని వార్తలొస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గీతా గోపీనాథ్... ఆమె రాక కేరళ ప్రజలకు లక్... కేరళ సీఎం, మరో వివాదాస్పదం