Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్ - బంగ్లాదేశ్ స్నేహబంధానికి బీటలు??

భారత్ - బంగ్లాదేశ్ స్నేహబంధానికి బీటలు??
, సోమవారం, 3 ఆగస్టు 2020 (08:34 IST)
భారత్ మిత్రదేశాల్లో బంగ్లాదేశ్ ఒకటి. కానీ, ఇటీవలి కాలంలో ఈ దేశ పాలకలు వైఖరి మారిపోయింది. ఫలితంగా భారత్‌కు శత్రుదేశాల జాబితాలోకి వెళ్లేలా అడుగులు వేస్తోంది. ఫలితంగా గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న భారత్ - బంగ్లాదేశ్ స్నేహబంధం బీటలు వారుతుందా అనే సందేహం కలుగుతోంది. దీనికి కారణం లేకపోలేదు.
 
నిజానికి భారతదేశానికి కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాల్లో బంగ్లాదేశ్ ఒకటి. అయితే ఇటీవలే ప్రధాని మోడీ సర్కార్​ తీసుకొచ్చిన భారత పౌరసత్వ సవరణ చట్టం సహా పలు నిర్ణయాలతో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు బీటలు వారుతున్నాయి. షేక్​ హసీనా ప్రభుత్వం అన్నింటికీ బీజింగ్​ వైపు చూడటం కలవరపెడుతోంది. 
 
మరోవైపు పాకిస్థాన్​కు కూడా బంగ్లా దగ్గరవడం దేశ భద్రతకు ముప్పు తెచ్చేలా ఉంది. కొవిడ్-19 భారత్​ను తీవ్రంగానే వణికిస్తోంది. ఇలాంటి నేపథ్యంలోనూ ప్రధాని నరేంద్ర మోడీ పొరుగుదేశాలే తమ మొదటి ప్రాధాన్యం అని తన అంతర్జాతీయ విధానాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. 
 
అంతేకాదు ఇటీవల పరిణామాల ద్వారా కుదేలైన దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘాన్ని (సార్క్) మహమ్మారిపై ఉమ్మడి పోరుకు ఏకం చేసేందుకు ప్రయత్నాలు చేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు ఒక విపత్తు నిధిని కూడా ఏర్పాటు చేశారు.
 
పొరుగుదేశాలతో సమాలోచనలు జరిపి వైరస్​పై పోరులో ఉత్తమ విధానాలను చర్చించారు. ఇలాంటి తరుణంలో మిత్రదేశమైన బంగ్లాతో సత్సంబంధాలు మెరుగ్గా లేకపోవడం కలవరపెడుతోంది. దీనికి కారణం బంగ్లాదేశ్‌తో పాటు.. పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్ వంటి దేశాలను చైనా రెచ్చగొడుతూ, తన వైపునకు తిప్పుకోవడమే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిన్న అమిత్ షా ... నేడు యడ్యూరప్ప.. కరోనా వైరస్ పాజిటివ్