Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : చర్చలో హిల్లరీ క్లింటన్‌కు హ్యాట్రిక్ గెలుపు

అమెరికా అధ్యక్ష పీఠానికి పోటీపడుతున్న డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ హ్యాట్రిక్ విజయాన్ని కైవసం చేసుకున్నారు. అధ్యక్ష అభ్యర్థికి పోటీ పడుతున్న అభ్యర్థుల మధ్య జరిగిన మూడు చర్చల్లో ఆమె గ

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : చర్చలో హిల్లరీ క్లింటన్‌కు హ్యాట్రిక్ గెలుపు
, శుక్రవారం, 21 అక్టోబరు 2016 (10:15 IST)
అమెరికా అధ్యక్ష పీఠానికి పోటీపడుతున్న డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ హ్యాట్రిక్ విజయాన్ని కైవసం చేసుకున్నారు. అధ్యక్ష అభ్యర్థికి పోటీ పడుతున్న అభ్యర్థుల మధ్య జరిగిన మూడు చర్చల్లో ఆమె గెలుపొందారు. అదేసమయంలో తన ప్రత్యర్థి డోనాల్డ్ ట్రంప్‌కు రాజకీయ అనుభవ లేమితో ఓటమిని మూటగట్టుకున్నారు. 
 
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకుంటూ రియాలిటీ షోలు నిర్వహించే ఆయన.. గురువారం లాస్‌వెగాస్‌లో జరిగిన మూడో ముఖాముఖి చర్చలోనూ డెమోక్రాటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ చాతుర్యం ముందు నిలవలేకపోయారు. ముఖ్యంగా డొనాల్డ్‌ తన విధానాలకు కట్టుబడి మాట్లాడారు. కాగా.. ఉభయులూ కనీసం కరచాలనం కూడా చేసుకోలేదు. ఎన్నికల ఫలితాలకు ఆమోదం, మహిళల పట్ల వైఖరి, తుపాకులు, విదేశాంగ విధానాలపై మూడో ముఖాముఖిలో సుమారు గంటన్నర పాటు విస్తృత చర్చ జరిగింది. ఫాక్స్‌ న్యూస్‌ యాం కర్‌ క్రిస్‌ వాలెస్‌ మోడరేటర్‌గా వ్యవహరించారు. 
 
ఇదిలావుండగా, ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా అంగీకరించే విషయమై స్పందించేందుకు ట్రంప్‌ నిరాకరించారు. రిగ్గింగ్‌ జరుగుతోందని ఆరోపిస్తున్న ఆయన.. ఓటమిని అంగీకరించనని సంకేతప్రాయంగా చెప్పారు. పోలింగ్‌ రోజైన నవంబరు 8దాకా తన వైఖరిపై సస్పెన్స్‌ కొనసాగిస్తానని, ఆ రోజున ఏ వైఖరి తీసుకోవాలో చూస్తానని తెలిపారు.
 
మరోవైపు ముఖాముఖి చర్చ తర్వాత ట్రంప్‌పై హిల్లరీ 13 శాతం ఆధిక్యంలో నిలిచి గెలిచారని అమెరికన్‌ మీడియా పేర్కొంది. ఈ చర్చను చూసినవారిలో 52 శాతం మంది హిల్లరీ బాగా మాట్లాడారని అనగా... 39 శాతం మంది ట్రంప్‌ను సమర్థించారని సీఎన్‌ఎన్‌ తెలిపింది. ఉభయుల ప్రచార బృందాలు మాత్రం తమదే విజయమని ప్రకటించుకున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యువతిని వేధించిన కేసు.. తొలిసారిగా యువకుడిని 3 రోజుల జైలు.. గుడిలో హత్య?