Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మ్యారేజ్‌ ట్రాక్ రికార్డు సరిగ్గా లేదు.. సలహాలు ఇవ్వలేను.. దయచేసి క్షమించండి..

పాకిస్థాన్ తెహరీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ అధినేత, మాజీ క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్.. వ్యక్తిగత జీవితంపై నోరు విప్పాడు. తన వైవాహిక జీవితం రికార్డు సరిగా లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. లండన్‌లోని తన ఫ్యామ

Advertiesment
Imran Khan hints he might be 'third time lucky' in marriage
, ఆదివారం, 20 నవంబరు 2016 (16:22 IST)
పాకిస్థాన్ తెహరీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ అధినేత, మాజీ క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్.. వ్యక్తిగత జీవితంపై నోరు విప్పాడు. తన వైవాహిక జీవితం రికార్డు సరిగా లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. లండన్‌లోని తన ఫ్యామిలీ ఫ్రెండ్ కూతురి పెళ్లికి వెళ్లిన ఇమ్రాన్.. ఆ జంటను ఆశీర్వదించాడు. 
 
అయితే మీకు తగిన సలహా ఇవ్వలేనంటూ చమత్కరించాడు. తనకు మ్యారేజ్‌ ట్రాక్ రికార్డు సరిగ్గా లేదని, అందుచేత మీకు ఎలాంటి సలహాను ఇవ్వలేనని.. దయచేసి క్షమించండి అంటూ ఇమ్రాన్ తెలిపాడు. అయినప్పటికీ ఆ జంటకు ఆల్ ద బెస్ట్ చెప్పాడు. 
 
తనకు మరో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందని కాబట్టే.. ఒక పెళ్లిన వెళ్లిన క్రమంలో ఇమ్రాన్ ఖాన్ అలా వ్యాఖ్యానించాడనే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. బీబీసీలో ప్రసారమయ్యే 'సౌత్ టుడే' అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా పని చేసిన రెహమ్ ఖాన్‌ను ఇమ్రాన్ గత జనవరిలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చితికి నిప్పంటించేటప్పుడు కేరింతలు కొట్టారు.. ఫేస్ బుక్ పేజీలో పోస్టులు..