లక్షలాది భారతీయులు మిత్రులయ్యారు.. త్వరలో భారత్ వస్తా అంటున్న ఇయాన్ గ్రిల్లాట్
మనుషులంతా సమానమే. కానీ శ్రీనివాస్ కూచిభొట్లను కాల్చి చంపిన అమెరికన్ పౌరుడు ప్యూరిన్టన్ చాలా పెద్ద తప్పు చేశాడని అతడి కాల్పులకు అడ్డుపడి తీవ్రంగా గాయపడిన మరో అమెరికన్ పౌరుడు ఇయాన్ గ్రిల్లాట్ చెప్పారు.
మనుషులంతా సమానమే. కానీ శ్రీనివాస్ కూచిభొట్లను కాల్చి చంపిన అమెరికన్ పౌరుడు ప్యూరిన్టన్ చాలా పెద్ద తప్పు చేశాడని అతడి కాల్పులకు అడ్డుపడి తీవ్రంగా గాయపడిన మరో అమెరికన్ పౌరుడు ఇయాన్ గ్రిల్లాట్ చెప్పారు.
జాత్యంహకారం కన్నూమిన్నూ గానని ఉన్మాదంతో భారతీయ ఉద్యోగులను కాల్పులు జరుపుతుంటే ప్రాణాలకు తెగించి కాపాడటానికి తుపాకి బుల్లెట్లకు అడ్డువెళ్లిన ఆ మానవత్వం, సాహసం పేరు ఇయాన్ గ్రిల్లాట్. శ్రీనివాస్ కూచిభొట్ల హత్యకు దారితీసీన కేన్సస్ ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమెరికన్ పౌరుడు ఇయాన్ మాటలు ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి.
ఆస్పత్రిలో ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ఇయాన్ తనకు లక్షలాది భారతీయులు స్నేహితులయ్యారని, త్వరలో భారత్ వస్తానని చెప్పారు. ‘నేను ప్రమాదంలో పడితే ఎలా సాయం కోసం చూస్తానో.. అలాగే కాల్పులను అడ్డుకోవాలని వెళ్లాన’ని చెప్పారు. ప్యూరిన్టన్ గన్‌లో బుల్లెట్లు అయిపోయాయని భావించానని, కాలేదని తెలిసినా అతన్ని అడ్డుకోవడం తప్ప మరో మార్గం లేదనుకున్నానని ఆ ఘటన గురించి వివరించారు. మనుషులంతా సమానేమనని చెబుతూ ప్యూరిన్టన్ చాలా పెద్ద తప్పు చేశాడని చెప్పారు.
ప్యూరిన్టన్ అనే జాత్యంహకారి జరిపిన కాల్పుల్లో తెలుగు ఇంజినీర్ కూచిభొట్ల శ్రీనివాస్ మరణించగా, అలోక్ రెడ్డి గాయపడ్డారు. ప్రాణాలకు తెగించి ఆ దురాగతాన్ని అడ్డుకోబోయిన ఇయాన్‌కు ఛాతీకి, చేతిపైనా బుల్లెట్ గాయాలయ్యాయి.