Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో గెలవాలి.. జంతర్ మంతర్ వద్ద హోమాలు, పూజలు!

డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో గెలవాలి.. జంతర్ మంతర్ వద్ద హోమాలు, పూజలు!
, గురువారం, 12 మే 2016 (18:00 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో రిపబ్లికన్ పార్టీ తరపున రంగంలోకి దిగిన డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలంటేనే ముందుంటారు. మిగిలిన దేశాల సంగతి ఎలా ఉన్నా భారత్ పేరు చెపితేనే ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సిలికాన్ వ్యాలీ మొత్తం ఇండియన్ సీఈవోలతో నిండిపోయి ఉందని చెప్పిన ట్రంప్ - తర్వాత ముస్లింలపై - బాలీవుడ్ పై ఇలా చెప్పుకుంటూ పోతే ట్రంప్ కాంట్రవర్సీ కామెంట్లకు లెక్కేలేదు.
 
భారతీయులను పదే పదే ట్రంప్ టార్గెట్ చేస్తుంటే మనదేశంలో మాత్రం ట్రంప్ గెలుపుకోరుతూ ప్రార్థనలు - హోమాలు చేస్తున్నారు. ఇటీవలే జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ట్రంప్ నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని కోరుతున్నారు. 
 
బుధవారం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ట్రంప్ గెలవాలని కోరుతూ హిందూసేన కార్యకర్తలు హోమం నిర్వహించారు. 'వి లవ్ ట్రంప్'-'వి సపోర్ట్ ట్రంప్' అని రాసివున్న ట్రంప్ ఫొటోలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్యారిస్ దాడుల నేపథ్యంలో అమెరికాలోకి ముస్లింలను రానివ్వకుండా నిషేధించాలని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిద్రపోతున్నప్పుడు భార్య దగ్గరకు వెళ్ళొద్దు.. భార్యను కొట్టే విషయం తెలీయకూడదు!