Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిద్రపోతున్నప్పుడు భార్య దగ్గరకు వెళ్ళొద్దు.. భార్యను కొట్టే విషయం తెలీయకూడదు!

నిద్రపోతున్నప్పుడు భార్య దగ్గరకు వెళ్ళొద్దు.. భార్యను కొట్టే విషయం తెలీయకూడదు!
, గురువారం, 12 మే 2016 (16:39 IST)
సోషల్ మీడియాలో ఓ వీడియో కలకలం సృష్టిస్తోంది. ఆ వీడియోలో ఏముందో తెలుసా? ఒక మతగురువు భార్యను ఎలా దండించాలో సలహాలిస్తూ దాన్ని వీడియో తీసి సోషియల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు పెనుసంచలనం సృష్టిస్తోంది. పూర్తి వివరాలను పరిశీలిస్తే.. సౌదీ అరేబియాకు చెందిన ఖలీద్ అల్ సఖాబీ అనే వ్యక్తి థెరపిస్టుగా పనిచేస్తున్నాడు. 
 
భర్త చెప్పిన మాటలను వినిపించుకోకుండా నడుచుకునే వారి భార్యలను ఎలా దండించాలనే విషయంలో అతడు ఓ వీడియోని రూపొందించాడు. అవేంటో తెలుసా.. భార్యను దండించడం ఎంతో కష్టమైన పనని నాకు తెలుసు. కానీ ఈ సమస్యను అల్లా ఆశీస్సులతో సురక్షితంగా బయటపడుతామని వివరించాడు. కోపంతో భార్యను కొట్టవద్దు. ఎంతో క్రమశిక్షణతో ఆ పనిచేయాలి. భార్యను కొట్టే విషయంలో కూడా ఇస్లాం నిబంధనలు పాటించాలి. భార్యలను ఇనుపరాడ్లు, కర్రలతో కొట్టకూడదు. అలాగే పదునైన ఆయుధాలు ఉపయోగించరాదు. 
 
పళ్లను శుభ్రం చేసుకునే చిన్న చువ్వలాంటి వస్తువు లేదా.. హ్యాండ్ కర్చీఫ్ ఉపయోగించాలని తెలిపాడు. కొట్టడానికి ముందు భర్తలు తమ హక్కులు.. భార్యల విధులు అల్లా ప్రకారం వారికి తెలియజేయాలి చెప్పాడు. నిద్రపోతున్నప్పుడు భార్య దగ్గరకు వెళ్లొద్దు. దురదృష్టవశాత్తు కొంతమంది భార్యలు భర్తలతో సమానంగా జీవించాలని అనుకుంటారు. ఇదే పెద్ద సమస్యను సృష్టిస్తుంది. కానీ, భర్త భార్యను కొడుతున్నాడన్న విషయం బయటకు తెలియకుండా చూసుకోవాలి' అంటూ ఆయన సలహాలు ఇచ్చాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రత్యేక హోదా వల్ల వచ్చేదేముంది..? తొట్టిగ్యాంగ్‌లా ఏదేదో మాట్లాడేస్తే ఎలా?: సుధీర్