Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మతం పేరిట మారణకాండ... కరాచీలో హిందూ డాక్టర్ హత్య

శత్రుదేశం పాకిస్థాన్‌లో మతం పేరిట మారణకాండ జరుగుతోంది. ఈ దేశంలో మైనార్టీలుగా నివశిస్తున్న హిందువులపై యధేచ్చగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ హిందూ డాక్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ వివరాలను పరిశీల

Advertiesment
Hindu doctor
, శనివారం, 6 ఆగస్టు 2016 (13:17 IST)
శత్రుదేశం పాకిస్థాన్‌లో మతం పేరిట మారణకాండ జరుగుతోంది. ఈ దేశంలో మైనార్టీలుగా నివశిస్తున్న హిందువులపై యధేచ్చగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ హిందూ డాక్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
డాక్టర్ ప్రీతమ్ అనే వ్యక్తి కరాచీలోని లఖ్వానీ గార్డెన్ ఈస్ట్‌లో నివసిస్తున్నాడు. ఈయన తన ఇంటికి సమీపంలోనే ఓ క్లినిక్ నడుపుతున్నాడు. ఈయన తన క్లినిక్ నుంచి బయటకు వస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ హత్యకు మతపరమైన భావజాలమే కారణంగా భావిస్తున్నారు. 
 
దీనిపై డాక్టర్ కుమారుడు మాట్లాడుతూ డాక్టర్ ప్రీతమ్ క్లినిక్ నుంచి ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేశారని తెలిపారు. తన తండ్రి సెల్‌ఫోన్ నుంచి తనకు కాల్ వచ్చిందని, ఆయనను హత్య చేసినట్లు చెప్పారని తెలిపారు. తన తండ్రికి ఎవరితోనూ శత్రుత్వం లేదని, బెదిరింపులు కూడా రాలేదని చెప్పారు. ముందస్తు పథకం ప్రకారమే దాడి జరిగిందని తెలిపారు. దాడి జరిగిన సమయంలో విద్యుత్తు సరఫరా లేదని పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంపన్నుల మంత్రుల లిస్ట్: 210 మంది క్రిమినల్స్.. 51మంది మహిళా మంత్రులు కోటీశ్వరులు!