Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

5 నెలలుగా అంతరిక్షంలో ఉన్న సునీతా విలియమ్స్ ఏం తింటున్నారు..

Sunita Williams

ఠాగూర్

, మంగళవారం, 19 నవంబరు 2024 (15:21 IST)
గత ఐదు నెలలుగా అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో ఉంటున్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారనే చర్చ సాగుతుంది. కేవలం ఎనిమిది నెలల పరిశోధన కోసం అంతరిక్ష పరిశోధన కోసం వెళ్లిన వారిద్దరూ వాహన నౌక బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతి సమస్య తలెత్తింది. దీంతో వారిద్దరూ అంతరిక్షంలోనే చిక్కుకునిపోయారు. అయితే, వారిద్దరి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ప్రమాదాలకు తావివ్వకుండా వచ్చే యేడాది ఫిబ్రవరిలో తిరిగి భూమికి తీసుకుని వచ్చేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా శాస్త్రవేత్తలు నిర్ణయించారు.
 
అయితే, గత ఐదు నెలలుగా ఐఎస్ఎస్‌లో ఉంటున్న వీరిద్దరూ మరో మూడు నెలలు అక్కడే ఉండనున్నారు. అయితే, ఈ వ్యోమగాములు అక్కడ ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. అలాగే ఐఎస్ఎస్‌లో ఉన్నపుడు ఆహారం ఎలా లభిస్తుందో తెలుసుకునేందుకు ఉత్సుకత చూపుతున్నారు. పైగా, ఇటీవల నాసా విడుదల చేసిన ఫోటోల్లో సునీత విలియమ్స్‌ బక్కచిక్కినట్టుగా కనిపించడం ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురిచేసింది. 
 
ప్రస్తుతం వీరిద్దరూ పాలు, పిజ్జా, రొయ్యలు, కాక్‌టెయిల్స్, రోస్ట్ చికెన్, ట్యూనా వంటి వివిధ రకాలైన ఆహార పదార్థాలు ఆరగిస్తున్నారు. ఈ విషయాన్ని స్టార్‌లైనర్ మిషన్‌కు చెందిన నిపుణుడు ఒకర న్యూయార్క్ పోస్ట్‌కు వెల్లడించారు. ఈ ఆహారంతో పాటు తాజా పండ్లు, కూరగాయలు కూడా తక్కువ మొత్తంలో అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రతి మూడు నెలలకు ఒకసార ఆహార పదార్థాలను ఐఎస్ఎస్‌కు చేరవేస్తుంటారని తెలిపారు. ఆహార పదార్థాలు గడ్డకట్టిన, ఎండిన స్థితిలో ఉంటాయని వివరించారు. ఆహార పదార్థాలను రోజువారీ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా సిద్ధం చేస్తామని స్టార్‌లైనర్ నిపుణుడు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

International Men’s Day 2024: పురుషుల సేవకు అంకింతం.. థీమ్ ఏంటి?