Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పోర్న్ సైట్లు చూశారో.. కుక్క ఇట్టే పట్టిచ్చేస్తుందట!

Advertiesment
Hard
, గురువారం, 10 జులై 2014 (16:08 IST)
అమెరికాలో పోర్న్ సైట్లు చూసేవారిని కుక్క ఇట్టే పట్టిచ్చేస్తుందట. అమెరికాలో మైనర్లు తప్పుదోవ పడుతున్నారు. కంప్యూటర్, ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో ఉండడంతో పోర్న్ సైట్లు బాలలను ప్రభావితం చేస్తున్నాయి. దాని కారణంగా అక్కడి బాలల్లో వికృతమైన ఆలోచనలు, నేర ప్రవృత్తి పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని నిరోధించడానికి పోలీసులు కుక్కను రంగంలోకి దించారు. ఈ కుక్క స్పెషాలిటీ ఏంటంటే వాసన చూసి బూతుబొమ్మల జాడ చెప్పేస్తుంది. 
 
అమెరికాలోని రోడ్ ఐలాండ్‌లో గోల్డెన్ లాబ్రడర్ జాతికి చెందిన థోరియో అనే శునకం అశ్లీల చిత్రాలతో కూడిన హార్డ్ డ్రైవ్, థంబ్ డ్రైవ్, ఇతర కంప్యూటర్ భాగాలను వాసన చూసి పట్టేస్తుంది. ఇంటర్నెట్‌లో అశ్లీల చిత్రాలు చూసేవారిని కూడా ఇది వదలడం లేదని అక్కడి పోలీసులు వెల్లడించారు. ఇందుకోసం దీనికి ప్రత్యేక శిక్షణ ఇచ్చామని పోలీసులు తెలిపారు. చైల్డ్ పోర్న్ వీడియోలు పట్టుకెళ్తున్న ఓ వ్యక్తిని థోరియో పట్టించిందని పోలీసులు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu