Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారతీయులు కంటే పాక్ ప్రజలు సంతోషంగా ఉన్నారట... ఆనందం కోసం అక్కడకు వెళ్ళాల్సిందే

'ఆరోగ్యమే మహాభాగ్యం' అన్నారు మన పెద్దలు. అలాగే, ఆనందాన్ని మించిన ఆరోగ్యం మరొకటి లేదన్నారు ఇంకొందరు. 'నవ్వడం ఒక యోగం... నవ్వకపోవడం ఓ రోగం' అన్నారో కవి. అయితే, ఆ ఆనందం, సంతోషం అనేవి మనిషి కోర్కెలు, వాటి

భారతీయులు కంటే పాక్ ప్రజలు సంతోషంగా ఉన్నారట... ఆనందం కోసం అక్కడకు వెళ్ళాల్సిందే
, మంగళవారం, 21 మార్చి 2017 (08:48 IST)
'ఆరోగ్యమే మహాభాగ్యం' అన్నారు మన పెద్దలు. అలాగే, ఆనందాన్ని మించిన ఆరోగ్యం మరొకటి లేదన్నారు ఇంకొందరు. 'నవ్వడం ఒక యోగం... నవ్వకపోవడం ఓ రోగం' అన్నారో కవి. అయితే, ఆ ఆనందం, సంతోషం అనేవి మనిషి కోర్కెలు, వాటిని నెరవేర్చుకునే విషయంపై ఆధారపడివుంటాయి. ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో ఆనందం దొరుకుతుందనే విషయంపై ఐక్యరాజ్యసమితి ఓ అధ్యయనం చేసి నివేదికను తయారు చేసింది. ఈ నివేదికను తాజాగా విడుదల చేసింది. అంటే.. "ప్రపంచ సంతోషకర దేశాలు-2017" పేరుతో ఈ నివేదిక విడుదలైంది. ఇందులోని అంశాలను పరిశీలిస్తే.. 
 
ప్రపంచంలో సంతోషంగా ఉన్న దేశాల జాబితాను పరిశీలిస్తే.. నార్వే అగ్రస్థానంలో ఉంటే.. డెన్మార్క్ రెండో స్థానంలో ఉంది. వాస్తవానికి గతంలో ఈ దేశమే మొదటి స్థానంలో ఉండేది. ఆ తర్వాత ఐస్ ల్యాండ్, స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, నెదర్లాండ్, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, స్వీడన్ సంతోషం వెల్లివెరిసే టాప్-10 దేశాలుగా ఉన్నాయి. అమెరికా 14వ స్థానంలో ఉంది. 
 
మరి భారత్ పరిస్థితిని పరిశీలిస్తే.. భారతీయులు కంటే పొరుగు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లో ప్రజలు ఎక్కువ సంతోషంతో ఉన్నారని ఐక్యరాజ్యసమితి నివేదిక చెబుతోంది. సంతోషకర దేశాల జాబితాలో భారత్ 121వ స్థానంలో ఉంటే చైనా 79, పాకిస్థాన్ 80, నేపాల్ 99, బంగ్లాదేశ్ 110, శ్రీలంక 120వ స్థానాల్లో ఉన్నాయట. 
 
అసలు సంతోషమే లేని దేశాల జాబితాను పరిశీలిస్తే.. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, బురుండీ, టాంజానియా, సిరియా, రువాండా, టోగో, గుయానా, లైబీరియా, సౌత్ సూడాన్, యెమన్ తదితర దేశాలు ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కడప జిల్లాలో వైకాపా పట్టుకోల్పోయిందా? బాబాయ్ ఎందుకు ఓడిపోయారు : జగన్ అంతర్మథనం