Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒసామాబిన్ లాడెన్ కొడుకు 'గ్లోబల్ టెర్రరిస్ట్' : అమెరికా ప్రకటన

అంతర్జాతీయ ఉగ్ర సంస్థ అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజాబిన్ లాడెన్‌ను గ్లోబల్ టెర్రరిస్ట్‌‌గా అమెరికా తాజాగా ప్రకటించింది. 20ఏళ్ల వయసున్న హంజాబిన్ లాడెన్‌‌పై సెక్షన్ 1 కింద అమెరికా ఆంక్ష

ఒసామాబిన్ లాడెన్ కొడుకు 'గ్లోబల్ టెర్రరిస్ట్' : అమెరికా ప్రకటన
, శుక్రవారం, 6 జనవరి 2017 (08:46 IST)
అంతర్జాతీయ ఉగ్ర సంస్థ అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజాబిన్ లాడెన్‌ను గ్లోబల్ టెర్రరిస్ట్‌‌గా అమెరికా తాజాగా ప్రకటించింది. 20ఏళ్ల వయసున్న హంజాబిన్ లాడెన్‌‌పై సెక్షన్ 1 కింద అమెరికా ఆంక్షలు విధించింది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (ఈఓ) 13224 ప్రకారం అమెరికా భద్రత కోసం హంజాబిన్‌తో లావాదేవీలు జరపడాన్ని నిషేధించారు. 
 
హంజాబిన్ లాడెన్ అల్‌ఖైదా అధికారిక సభ్యుడని 2015వ సంవత్సరం ఆగస్టు 14న అల్ ఖైదా సీనియర్ నేత అమన్ అల్-జవహిరి ప్రకటించారు. జవహిరి ప్రకటన అనంతరం హంజా తీవ్రవాద కార్యకలాపాల్లో చురుకుగా నిమగ్నమై ఉన్నట్లు అమెరికా పేర్కొంది. అందుకే అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించామని అమెరికా వివరించింది.
 
లాడెన్ మరోకుమారుడు ఒమర్ బిన్ లాడెన్‌కు ఈజిప్టులోకి ప్రవేశం లభించలేదు. ఒమర్ తన భార్య జైన అల్ సబాహ్‌తో దోహా నుంచి కైరో చేరుకున్నాడు. విమానాశ్రయంలో అధికారులు వారిని అడ్డుకోవడంతో.. చేసేది లేక టర్కీ పయనమయ్యారు. ఒమర్ దంపతులు 2007, 2008 సంవ్సతరాల్లో చాలా రోజులు కైరోలోనే ఉన్నారు. 
 
ఇప్పడు నిషేధిత వ్యక్తుల జాబితాలో ఒమర్ పేరు చేర్చడానికి కారణం ఏమిటనేది అధికారులు వెల్లడించలేదని సమాచారం. 2001లో తండ్రి నుంచి విడిపోయిన ఒమర్ 1996 నుంచి 2001 వరకు ఆప్ఘనిస్తాన్ ఉన్నాడు. 2010లో ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో ఒమర్ మాట్లాడుతూ లాడెన్ సంతానం మంచి పౌరులుగా ఉండాలనుకుంటున్నారని, అయితే అల్‌ఖైదా నాయకుడి పిల్లలుగా ముద్ర పడిపోయిందని, తామెవరం అందులో భాగస్వాములు కాదని చెప్పుకొచ్చాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శశికళ సీఎం ఎలా అవుతారో చూస్తా.. ఎక్కడ పోటీ చేసినా నేను బరిలో ఉంటా : జయ మేనకోడలు దీపా