Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శత్రు దేశం పదాన్ని సోదర దేశంగా మారుద్దాం: గుర్ మెహర్‌కి పాక్ సోదరుడి సందేశం

కార్గిల్‌ అమర సైనికుడి కుమార్తె గుర్మెహర్‌ కౌర్‌ రామ్‌జాస్‌ కాలేజీ అల్లర్ల నేపథ్యంలో సోషల్‌మీడియాలో చేసిన పోస్ట్‌ దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయమై ఓ పాకిస్థాన్‌ యువకుడు స్పం

Advertiesment
శత్రు దేశం పదాన్ని సోదర దేశంగా మారుద్దాం: గుర్ మెహర్‌కి పాక్ సోదరుడి సందేశం
హైదరాబాద్ , గురువారం, 2 మార్చి 2017 (04:36 IST)
కార్గిల్‌ అమర సైనికుడి కుమార్తె గుర్మెహర్‌ కౌర్‌ రామ్‌జాస్‌ కాలేజీ అల్లర్ల నేపథ్యంలో సోషల్‌మీడియాలో చేసిన పోస్ట్‌ దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె చేసిన పాత వ్యాఖ్యలను కూడా బయటకు లాగి సందర్భం ఉన్నా లేకున్నా ఆమెను విమర్శించడమే లక్ష్యంగా కొందరు వ్యాఖ్యానించారు. పలువురు మేధావులు ఆమెకు మద్దతుగానూ నిలిచారు. తాజాగా ఈ విషయమై ఓ పాకిస్థాన్‌ యువకుడు స్పందిస్తూ గుర్మెహర్‌కు మద్దతుగా నిలిచాడు. గుర్మెహర్‌ లాగే తాను ఏం చెప్పాలనుకుంటున్నాడో ప్లకార్డుల ద్వారా ఇలా చెప్పుకొచ్చాడు.

 

‘‘హాయ్‌ గుర్మెహర్‌ కౌర్‌. నాపేరు ఫయాజ్‌ ఖాన్‌. నా స్వస్థలం పాకిస్థాన్‌. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో చదువుతున్నా. నేను తొలిసారి ఆస్ట్రేలియాకి వచ్చినప్పుడు నాకు స్కూల్లో భారతీయుల పట్ల ఎలా మెలగాలని చెప్పారో ఇక్కడ కాలేజ్‌లో చదువుతున్న భారతీయుల పట్ల అలాగే ఉన్నాను. ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే వారితో కలిసిపోయి బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా మారిపోయాం. కార్గిల్‌ యుద్ధంలో నువ్వు నీ తండ్రిని పోగొట్టుకున్నందుకు మేమంతా చింతిస్తున్నాం. ఇలాంటి యుద్ధాలు జరుగుతున్నప్పుడు చావు మా ఇంటికి (స్వాత్‌ ప్రాంతం) సమీపంలోనే ఉంది. కానీ అదృష్టవశాత్తు నేను నా కుటుంబాన్ని పోగొట్టుకోలేదు. 
 
కానీ అలాంటి సమయంలో నీలాంటి వాళ్లని వేలల్లో చూశాను. నాకు ఎలాంటి వీసా నిబంధనలు లేకుండా భారత్‌కి రావాలని ఉంది. మన దేశాల మధ్య ఉండే నిబంధనలకు వ్యతిరేకంగా పోరాడదాం. సరిహద్దు ప్రాంతాల్లో నీలా బాధపడుతున్నవారిని కాపాడటానికి శాంతికోసం పోరాడదాం. గుర్మెహర్‌.. నేను నీకు ప్రేమను పంచే తండ్రిని ఇవ్వలేను కానీ శత్రు దేశం నుంచి ఓ మంచి సోదరుడిని ఇవ్వగలను. ముస్లిం సోదరుడు, సిక్కు సోదరి లాంటి భావన ప్రపంచవ్యాప్తంగా ఉండేలా చేద్దాం. శత్రు దేశం అన్న పదం సోదర దేశంగా మార్చాలి. శాంతికి ఇదే చక్కటి ప్రొఫైల్‌’’ అంటూ గుర్మెహర్‌కి అండగా నిలిచాడు ఫయాజ్‌.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అది జాత్యహంకార హత్యే.. ఖండిస్తున్నా: నోరు విప్పిన ట్రంప్‌