Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భూమివైపు భారీ గ్రహశకలం: ఎంతో ప్రమాదకరమైనది..?

భూమివైపు భారీ గ్రహశకలం: ఎంతో ప్రమాదకరమైనది..?
, మంగళవారం, 18 జనవరి 2022 (18:01 IST)
Earth
భూమివైపు భారీ గ్రహశకలం దూసుకొస్తోందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలిపింది. భూమిపైనున్న అత్యంత ఎత్తైన భవనం "బుర్జ్ ఖలీఫా" కంటే రెండు రేట్లు పెద్దదిగా ఉన్న ఆ ఆ గ్రహశకలం మంగళవారం నాడు భూమికి చేరువగా, భూ కక్ష్యను దాటనుంది. దాదాపు ఒక కిలోమీటర్ వెడల్పు కలిగి ఉన్న ఈ గ్రహశకలం ఎంతో ప్రమాదకరమైనదిగా నాసా పేర్కొంది.
 
ప్రస్తుతం 1994 PC1 గ్రహశకలం భూమికి 1,230,000-మైళ్ళు చేరువుగా వచ్చి, భూమి యొక్క కక్ష్యను.. క్షితిజ సమాంతరంగా దాటనున్నట్లు నాసా తెలిపింది. దీని వలన భూమికి ఎటువంటి ప్రమాదం వాటిల్లదని నాసా పేర్కొంది.
 
గ్రహశకలం 7482గా నామకరణం చేయబడిన ఈ గ్రహశకలాన్ని మొట్టమొదట మొదట ఆస్ట్రేలియాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్త రాబర్ట్ మెక్ నాట్ 1994 ఆగస్టు 9న కనుగొన్నారు. అప్పట్లో దీనిని 1994 PC1గా పిలిచేవారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా కేసులు పెరుగుతుంటే స్కూల్స్ కొనసాగింపా? పవన్ కళ్యాణ్