ఫ్రాన్స్ దేశంలో లైంగిక వ్యాధుల బారినపడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని మహిళలకు ఉచితంగా కండోమ్స్ అందజేయాలని నిర్ణయించారు. ప్రతి మెడికల్ షాపులో ఇవి అందుబాటులో ఉంటాయని తెలిపారు. అదీకూడా 25 యేళ్లలోపు వారికి మాత్రమే ఇవి ఇస్తారు.
ఫ్రాన్స్ దేశంలోని యువతీ యువకులు, స్త్రీపురుషులు ఎలాంటి జాగ్రత్తలు లేకుండా విచ్చలవిడి శృంగారంలో పాల్గొంటున్నారు. దీంతో లైంగిక వ్యాధుల బారినపడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ వ్యాధులను అరికట్టేందుకు వీలుగా వచ్చే యేడాది జనవరి నుంచి ఉచితంగా కండోమ్స్ అందజేయాలని నిర్ణయించారు. అయితే, పురుషులకు మాత్రం ఇవి ఉచితంగా ఇవ్వరు.
ఫ్రాన్స్‌లో అడ్డూఅదుపు లేకుండా ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. దీంతో మహిళలు లేదా యువతులు అవాంఛిత గర్భందాల్చితే మహిళల ఆర్థిక కష్టాలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. అందుకే వారికి వీటిని ఉచితంగా అందివ్వాలని నిర్ణయించింది. ఈ దేశంలో 2020-21 మధ్యకాలంలో లైంగిక సాంక్రమిక వ్యాధులు ఏకంగా 30 శాతం మేరకు పెరిగిపోయాయి.