Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షాకింగ్... తలను తాకుతూ వెళ్లిన విమానం... అతను ఏమయ్యాడు?

జస్ట్... వెంట్రుక వాసిలో అతడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. భూమి మీద అతడికి నూకలు ఇంకా ఉండబట్టే అతడు బతికి బయటపడ్డాడు. ఓ విమానం మన తలను తాకుతూ వెళితే ఇంకేమన్నా ఉందా... పైప్రాణాలు పైనో పోతాయి. ఇలాంటి ఘటనే ఒకటి అమెరికాలో వారం రోజుల క్రితం జరిగింది

Advertiesment
షాకింగ్... తలను తాకుతూ వెళ్లిన విమానం... అతను ఏమయ్యాడు?
, సోమవారం, 26 సెప్టెంబరు 2016 (21:13 IST)
జస్ట్... వెంట్రుక వాసిలో అతడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. భూమి మీద అతడికి నూకలు ఇంకా ఉండబట్టే అతడు బతికి బయటపడ్డాడు. ఓ విమానం మన తలను తాకుతూ వెళితే ఇంకేమన్నా ఉందా... పైప్రాణాలు పైనో పోతాయి. ఇలాంటి ఘటనే ఒకటి అమెరికాలో వారం రోజుల క్రితం జరిగింది. 
 
అమెరికాలోని నెవెడాలో గత వారం సెప్టెంబరు 18న జరిగిన రెనో నేషనల్ ఛాంపియన్‌షిప్ ఎయిర్‌రేస్‌లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. థామస్ రిచర్డ్ అనే వ్యక్తి ఎయిర్ రేస్‌లో పాల్గొన్నాడు. అతడి విమానం సాంకేతిక లోపంతో రన్ వేపై ఆగిపోయింది. అతడు దాన్ని స్టార్ట్ చేసేందుకు ఎంత ప్రయత్నించినా విమానం మాత్రం కదల్లేదు. ఇంతలో రేస్ లో పాల్గొన్న ఇతర పోటీదారుల విమానాలు రయ్యమంటూ రన్ వే పైకి దూసుకుంటూ వచ్చాయి. 
 
ఆ విమానాల్లో ఒక విమానం రన్ వే పైనే ఆగివున్న థామస్ విమానాన్ని ఢీకొడుతూ థామస్ తలను తాకుతూ వెళ్లింది. జస్ట్ వెంట్రుక వాసిలో అతడికి ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనను దూరంగా చూస్తూ ఉన్న సిబ్బంది పరుగెత్తుకుంటూ వచ్చారు. అతడి చేతికి గాయం మాత్రమే అయ్యింది. పెద్ద గాయాలేమీ తగల్లేదు. కాక్ పిట్‌లో రికార్డయిన ఈ ఘటన తాలూకు వీడియోను అతడు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పోస్టు చేశాడు. అదిప్పుడు వైరల్‌గా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాశ్మీర్ మాదే... గాజుమేడలో ఉన్నారు జాగ్రత్త... పాక్‌కు సుష్మా వార్నింగ్