Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముషారఫ్ షాక్... ఆస్తులు స్వాధీనానికి కోర్టు ఆదేశం

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు ఆ దేశ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు తేరుకోలేని షాక్ ఇచ్చింది. ముషారఫ్ పరారీలో ఉన్న నేరస్తుడని, అందువల్ల ఆయన ఆస్తులను స్వాధీనం చేుసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

Advertiesment
ముషారఫ్ షాక్... ఆస్తులు స్వాధీనానికి కోర్టు ఆదేశం
, శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (09:11 IST)
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు ఆ దేశ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు తేరుకోలేని షాక్ ఇచ్చింది. ముషారఫ్ పరారీలో ఉన్న నేరస్తుడని, అందువల్ల ఆయన ఆస్తులను స్వాధీనం చేుసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో గత 2007 డిసెంబర్ 27వ తేదీన దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ముషారఫ్‌పై ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనపై కేసు నమోదు చేయగా, ఈ కేసు విచారణ సాగుతోంది. 
 
ఈ కేసు విచారణ ఉగ్రవాద వ్యతిరేక కోర్టులో సాగుతోంది. ఈ నేపథ్యంలో బెనజీర్‌ భుట్టో కేసుకు సంబంధించి ముషారఫ్‌ పరారీలో ఉన్న నేరస్తుడని కోర్టు స్పష్టం చేసింది. ఈ హత్య కేసు నమోదైన అనంతరం దీని విచారణలో 8 మంది జడ్జిలు మారారు. ఎట్టకేలకు జడ్జి అస్గర్ ఖాన్ తీర్పుచెప్పారు. ఈ కేసులో పర్వేజ్ ముషారఫ్‌‍తో పాటు రావల్పిండి మాజీ సీపీవో సాద్‌ అజీజ్, రావల్‌ టౌన్‌ ఎస్పీ ఖుర్రమ్‌ షెహజాద్‌‌లను న్యాయస్థానం దోషులుగా ప్రకటించింది. 
 
ఈ సందర్భంగా ముషారఫ్ పరారీలో ఉన్న నేరస్థుడని, అతని ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మిగిలిన ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులకు 17 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరూ 5 లక్షల రూపాయల జరిమానా విధించింది. వైద్యపరీక్షల పేరుతో గత ఏడాది దుబాయ్‌కు పారిపోయిన ముషారఫ్ ఇంకా స్వదేశం చేరుకోని విషయం తెల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టెక్సాస్ నగరాన్ని ఖాళీ చేయకుంటే చచ్చిపోతారట...