విమానాల్లో కూడా ఆకతాయిల గొడవలు.. కాక్‌పిట్‌లో కలకలం.. మహిళలపై పిడిగుద్దులు!
ఆకతాయిల ఆగడాలు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ... రోడ్లు, బస్సులు, రైళ్లు... ఇలా అన్నిచోట్లా... మితిమీరిపోతున్నాయి. ఇప్పుడు ఏకంగా విమానాల్లో కూడా ఆకతాయిల గొడవలు శృతమించుతున్నాయి. ఎంతో క్రమ
ఆకతాయిల ఆగడాలు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ... రోడ్లు, బస్సులు, రైళ్లు... ఇలా అన్నిచోట్లా... మితిమీరిపోతున్నాయి. ఇప్పుడు ఏకంగా విమానాల్లో కూడా ఆకతాయిల గొడవలు శృతమించుతున్నాయి. ఎంతో క్రమశిక్షణగా ఉండాల్సిన ఫ్లైట్లో కలకలం సృష్టిస్తున్నారు.
తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఇటీవల టాక్సియింగ్కు బయలుదేరేందుకు సిద్ధమైన విమానంలో ఇద్దరు వ్యక్తులు విమాన సిబ్బందితో గొడవకి దిగారు. చిన్నగా మొదలైన గొడవ పెను తుఫానులా మారింది. మహిళ అనే కనీస ఇంకితజ్ఞానం కూడా లేకుండా ఆమెపై పిడిగుద్దులు గుద్ది రక్తస్రావమయ్యేంత వరకు చితకబాదారు. ఇదేంటని ప్రశ్నించిన తోటి ప్రయాణికుడి మీద చేయిచేసుకున్నారు.
కాక్ పిట్ కేసి కొట్టడమేకాకుండా కాక్ పిట్‌ను ఫుట్‌బాల్ తన్నినట్టు పదేపదే తన్నారు. దాటోంగ్ నుంచి చాంకింగ్కు వెళ్లేందుకు వచ్చిన ఆ ఇద్దరు బిజినెస్ క్లాస్లోకి అప్గ్రేడ్ చేసుకునేందుకు విఫలమైన క్రమంలో ఈ దాడికి పాల్పడ్డారు. పోలీసులు వచ్చిన తర్వాత కూడా వారి అరాచకాలు ఆగలేదు. అక్కడికి వచ్చిన పోలీసులు వారిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. కాగా వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో దాడులకు పాల్పడుతున్న ప్రయాణీకుల వివరాలను ఫొటోలతో సహా విమానయాన సంస్థ తన ఆన్లైన్ విభాగంలో పెట్టింది.