Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రపంచంలోనే అరుదైన రత్నం కోహినూర్ కంటే నాణ్యమైనదట..!

ప్రపంచంలోనే అరుదైన రత్నంగా పేరొందిన ఒక ఇంద్రనీల రత్నంని తొలిసారిగా ప్రజల సందర్శణార్థం దక్షిణ ఆస్ట్రేలియా మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ‘ది ఫైర్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా’గా ప్రసిద్ధి చెందిన ఈ ఇంద్రనీల రత్నం విలువ 70 వేల కోట్ల రూపాయలని అంచనా. ఈ ముడి రత్నం బరువ

Advertiesment
the Fire of Australia
హైదరాబాద్ , సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (23:01 IST)
ప్రపంచంలోనే అరుదైన రత్నంగా పేరొందిన ఒక ఇంద్రనీల రత్నంని తొలిసారిగా ప్రజల సందర్శణార్థం దక్షిణ ఆస్ట్రేలియా మ్యూజియంలో ఏర్పాటు చేశారు.  ‘ది ఫైర్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా’గా ప్రసిద్ధి చెందిన ఈ ఇంద్రనీల రత్నం విలువ 70 వేల కోట్ల రూపాయలని అంచనా.  ఈ ముడి రత్నం బరువు 998 గ్రాములుంది. ఇంత బరువుగలది.

ఇంత నాణ్యమైన రత్నం దొరకడం ప్రపంచంలో చాలా అరుదని మ్యూజియం అధికారులు తెలిపారు. ఆస్ట్రేలియాలోని అదెలేయిడ్‌ నగరంలోని మ్యూజియంలో మొట్టమొదటి సారిగా ప్రజల సందర్శనార్థం ఏర్పాటు చేశారు. 
 
దాదాపు 60 ఏళ్ల క్రితం, 1946లో కూబర్‌ పెడీ అనే ఓ ఎడారి పట్నంలో వాల్టర్‌ బార్టమ్‌ అనే మైనర్‌ దీన్ని కనుగొన్నారు. సహజంగా సప్త రంగులు కనిపించే ఇలాంటి ఇంద్రనీల రత్నంపై నీలి రంగు ఎక్కువగా ఉంటుంది. ఎరుపు రంగు తక్కువగా ఉంటుంది. దీనికి ఎరుపు రంగు ఎక్కువగా ఉండడం వల్ల ఇది మరింత విలువైనదిగా ప్రసిద్ధికెక్కింది.

ప్రపంచంలో 90 శాతం రత్నాలు దక్షిణ ఆస్ట్రేలియాలోనే తయారవుతాయని, రత్నాల మైనింగ్, పంపిణీ బిజినెస్‌ కలిగిన వాల్టర్‌ బార్టమ్‌ తెలిపారు. దాదాపు 60 ఏళ్లుగా దీన్ని సేఫ్‌ లాకర్‌లో భద్రపర్చామని తెలిపారు. 
 
దక్షిణ ఆస్ట్రేలియా మ్యూజియం అంటే తమకు ఎంతో గౌరవమని, పైగా దీన్ని మ్యూజియంలో ఉంచితేనే ఎప్పటికైనా భద్రంగా ఉంటుందన్న నమ్మకంతో మ్యూజియం అధికారులకు అందజేశామని వాల్టర్‌ కుమారుడు అలన్‌ మీడియాకు తెలిపారు.

సాధారణంగా ఇంత బరువు గల రత్న రాళ్లను తాము పాలిష్‌ చేయమని, నగలను తయారు చేసిన తర్వాతనే ఇలాంటి రత్నాలను పాలిష్‌ చేస్తారని వాల్టర్‌ తెలిపారు.  
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డొనాల్డ్ ట్రంప్ అంతుతేలుద్దా.. కోర్టుకెక్కిన 97 టెక్ దిగ్గజ కంపెనీలు