Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డొనాల్డ్ ట్రంప్‌ ఇలా మారిపోయారా? వామ్మో.. శాంతి మంత్రం జపిస్తున్నారే?

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించినప్పటికీ నుంచి డొనాల్డ్ ట్రంప్ చాలా దూకుడుగా వ్యవహిరిస్తున్నారు. సైనిక చర్యలకు గానీ, బాంబు దాడులకు కానీ ఏమాత్రం వెనుకడుగు వేయని డొనాల్డ్ ట్రంప్.. తొలిసారిగా శా

డొనాల్డ్ ట్రంప్‌ ఇలా మారిపోయారా? వామ్మో.. శాంతి మంత్రం జపిస్తున్నారే?
, శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (10:31 IST)
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించినప్పటికీ నుంచి డొనాల్డ్ ట్రంప్ చాలా దూకుడుగా వ్యవహిరిస్తున్నారు. సైనిక చర్యలకు గానీ, బాంబు దాడులకు కానీ ఏమాత్రం వెనుకడుగు వేయని డొనాల్డ్ ట్రంప్.. తొలిసారిగా శాంతి మంత్రి జపించి.. అందరికీ షాక్ ఇచ్చారు. అణుకార్యక్రమం విషయంలో అమెరికా, ఉత్తర కొరియా దేశాల మధ్య భవిష్యత్తులో తీవ్ర స్థాయిలో ప్రతిష్టంభన నెలకొంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
 
ఇకపై తాము సైనిక పరమైన చర్యలతో ముందుకు వెళ్లకుండా... ఆర్థిక కార్యక్రమాలతో ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే, ఇది కొంచెం క్లిష్టతరమైందని అన్నారు. అయితే ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకొచ్చారు. ఇందుకు దౌత్య మార్గమే సరైందని ట్రంప్ తెలిపారు. ఉత్తర కొరియాతో ఉన్న విభేదాలను పరిష్కరించుకునేందుకు చాలా అవకాశాలున్నాయని చెప్పారు. తానైతే ఈ సమస్యకు శాంతియుత పరిష్కారం కోరుకుంటున్నానని చెప్పారు.
 
ఇదిలా ఉంటే.. అమెరికా - మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టి తీరతామని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌ పునరుద్ఘాటించారు. భారీ ఖర్చుతో కూడుకున్న ఈ వివాదాస్పద భారీ గోడ నిర్మాణాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టారని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఎవరికైనా సందేహాలుంటే తీర్చుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గోడ కట్టడాన్ని ఆపే ప్రసక్తే లేదన్నారు. దీని నిర్మాణం ద్వారా మత్తుపదార్థాలు, మనుషుల అక్రమ రవాణాను నిరోధించవచ్చునని ట్రంప్ వివరణ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దినకరన్‌ కోసం ఐపీఎస్‌ల లాబీయింగ్.. ఉచ్చులో చిక్కనున్నారా?