Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒబిసిటీని క్యాష్ చేసుకున్న ఇంగ్లండ్ మహిళ.. డబ్బుకు డబ్బుకు.. ఈజీగా పబ్లిసిటీ ఎలా?

Advertiesment
England woman earning monthly Rs.5crore
, మంగళవారం, 10 మే 2016 (11:00 IST)
ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది ఒబిసిటీతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒబిసిటీని క్యాష్ చేసుకుంది ఓ ఇంగ్లండ్ మహిళ. అధిక బరువును అధిగమించడం ఎలా.. అనే దానిపై ఓ వైబ్ సైట్ ఓపెన్ చేసింది. స్లిమ్‌గా తయారుకావడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని ఆ వెబ్ సైట్లో పోస్ట్ చేసింది. అంతేగాకుండా ఆ హోమ్ మేడ్ రెమెడీస్‌తోనే తానూ బరువు తగ్గింది. దీంతో ప్రస్తుతం ఆ మహిళ టిప్స్‌కు ఇంటర్నెట్లో భలే క్రేజ్ లభిస్తోంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌లోని డాన్ కాస్టర్‌కు చెందిన టెర్రీ ఆన్ అనే 32 ఏళ్ల మహిళ. ఇద్దరి పిల్లలకు తల్లి అయిన టెర్రీ అధిక బరువును చిన్న హోమ్ టిప్స్‌తో అధిగమించింది. సన్నబడ్డాక ఆ ఫోటోలను ఆన్ లైన్‌లో ఉంచింది. అంతే ఫోటోలను చూసిన వాళ్లు ఆ టిప్స్ తమకు కూడా చెప్పాల్సిందిగా అడిగారు. దీన్నే క్యాష్ చేసుకుని.. ఆ సీక్రెట్స్‌ను ఓ వెబ్‌సైట్ రూపంలో పెట్టేసింది. వెయిట్ లాస్‌పై పుస్తకం కూడా టెర్రీ రాసి మార్కెట్‌లోకి విడుదల చేసింది. అంతే అమ్మగారికి ఓ వైపు డబ్బుకు డబ్బు.. మరోవైపు పబ్లిసిటీ కూడా ఈజీగా వచ్చేసింది. పనిలో పనిగా బరువూ తగ్గిపోయింది. 
 
ఈ వెబ్ సైట్ ద్వారా ఏడాదికి మన కరెన్సీలో రూ.5 కోట్లు సంపాదిస్తోంది టెర్రీ ఆన్. అప్పటి వరకు సింగిల్ బెడ్ రూమ్ ఇంటికే పరిమితమైన టెర్రీ ఈ ఉపాయంతో ఓ పెద్ద బంగ్లానే కొనేసి లగ్జరీ లైఫ్ సాగిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బయోసైన్స్‌ మెథడాలజీలో గణితం సబ్జెక్టు చేర్చారనీ హెయిర్‌ డై తాగి విద్యార్థిని సూసైడ్