దిగ్గజ మొబైల్ సంస్థ యాపిల్ చైనాకు ఊహించిన షాక్ ఇచ్చింది. చైనీస్ యాప్ స్టోర్‌లోని 4500 మొబైల్ గేమ్స్‌ను తొలగించింది. గడిచిన మూడు రోజుల్లోనే ఇంత పెద్ద మొత్తంలో గేమ్స్‌ను తొలగించడంతో చైనా కంపెనీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అయితే గేమింగ్ లైసెన్స్ నింబంధనల్లో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిన యాపిల్ దానిలో భాగంగానే చైనా గేమ్స్‌ను తొలగించినట్లు ప్రకటించింది. ఎలాంటి చట్టపరమైన అనుమతి లేని గేమ్స్ కూడా యాప్స్‌లో ఉంచుతున్నారని, ఇక మీదట అలాంటి వాటికి ఆస్కారం లేకుండా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది.
భారత్-చైనా సరిహద్దుల్లో చోటుచేసున్న హింసాత్మక ఘటన నేపథ్యంలో ఆ దేశానికి చెందిన 59 యాప్స్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు 45 వేలకోట్ల రూపాయల వరకు చైనా కంపెనీలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని గ్లోబల్ టైమ్స్ అంచనా వేస్తోంది.