మెక్సికోలో భారీ భూకంపం... ఊగిపోయిన విద్యుత్ స్తంభాలు (Video)
మెక్సికో నగరం ఊగిపోయింది. భారీ భూకంపం ఆ నగరాన్ని షేక్ చేసింది. రిక్టర్ స్కేల్‌పై 8.2 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి మెక్సికో నగరంలోని విద్యుత్ స్తంభాలు కొబ్బరి చెట్లలా ఊగిపోయాయి. దీనికి సంబంధించిన వీడి
మెక్సికో నగరం ఊగిపోయింది. భారీ భూకంపం ఆ నగరాన్ని షేక్ చేసింది. రిక్టర్ స్కేల్‌పై 8.2 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి మెక్సికో నగరంలోని విద్యుత్ స్తంభాలు కొబ్బరి చెట్లలా ఊగిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ట్విట్టర్‌లో హల్‌చల్ చేస్తున్నారు.
ఈ భూప్రకంపనలు ఓ బ్రిడ్జ్‌పై ఉన్న ల్యాంప్‌పోస్టులు అటూ ఇటూ ఊగుతూ కనిపించాయి. భూకంపం వచ్చిన సమయంలో వీధి దీపాలు ఒకటే తీరుగా షేక్ అయ్యాయి. మరోవైపు ఆ టైమ్‌లో రోడ్డుపై విపరీతంగా ట్రాఫిక్ ఉంది. పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ ఇప్పటికే సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. దాదాపు 3 మీటర్ల ఎత్తులో సునామీ వచ్చే అవకాశాలున్నాయి. చియాపాస్‌కు సమీపంలో ఉన్న తీరంలో భూకంపం సంభవించింది.