జీ-7 సదస్సులో పాల్గొనేందుకు లండన్ వెళ్లిన భారత ప్రతినిధుల్లో ఇద్దరికి కరోనా సోకింది. ఈ నేపథ్యంలో ప్రతినిధుల బృందంలోని సభ్యులంతా స్వీయ ఐసొలేషన్‌లో ఉన్నట్లు బ్రిటన్ ప్రభుత్వం బుధవారం తెలిపింది.
జీ 7 గ్రూప్‌లో భారత్ సభ్య దేశం కాదు. అయినప్పటికీ లండన్ జరిగే ఈ సదస్సుకు భారత్‌తోపాటు ఆస్టేల్రియా, దక్షిణ ఆఫ్రికా, దక్షిణ కొరియా దేశాలను బ్రిటన్ ఆహ్వానించింది. దీంతో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌తో కూడిన భారత ప్రతినిధుల బృందం లండన్‌కు వెళ్లింది.
మరోవైపు కరోనా నేపథ్యంలో ప్రతినిధులకు ప్రతి రోజు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రతినిధుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వారందరినీ స్వీయ ఐసొలేషన్‌లో ఉంచినట్లు బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది.
భారత ప్రతినిధులు వర్చువల్‌గా సదస్సులో పాల్గొంటారని పేర్కొంది. అయితే కేంద్ర మంత్రి జైశంకర్‌కు కరోనా సోకలేదని వెల్లడించింది. కాగా, ఆయన బ్రిటన్ అంతర్గత మంత్రితో మంగళవారం సమావేశమైనట్లు స్థానిక మీడియా పేర్కొంది.