భార్య లేదనీ పనిమనిషిని రేప్ చేయబోయాడు.. చివరకు చచ్చాడు.. ఎలా?
తన ఇంట్లో పాచిపని చేసే ఓ పనిమనిషిపై భార్యాపిల్లలు లేని సమయంలో అత్యాచారం చేసేందుకు యత్నించిన ఇంటి యజమాని చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన దుబాయ్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను
తన ఇంట్లో పాచిపని చేసే ఓ పనిమనిషిపై భార్యాపిల్లలు లేని సమయంలో అత్యాచారం చేసేందుకు యత్నించిన ఇంటి యజమాని చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన దుబాయ్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
ఫిలిప్పీన్ దేశం నుంచి దుబాయ్‌కి ఓ 30 ఏళ్ల జెనీఫర్ డాల్కౌజ్ మహిళ వలస వచ్చింది. ఆ తర్వాత దుబాయ్ సేఠ్ ఇంట్లో పనికి కుదిరింది. 2014 డిసెంబర్ నెలలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో యజమాని ఆమెపై అత్యాచారం చేయబోయాడు. ఆత్మరక్షణ చేసుకునే ప్రయత్నంలో అతడిని కత్తితో పొడిచి చంపింది.
యజమాని చనిపోయాడనుకుని నిర్ధారించుకున్న జెన్నీఫర్.. ఏం చేయాలో తెలియక తన పాస్‌పోర్ట్, వీసా పత్రాలను తీసుకుని ఇంటి నుంచి పారిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఇంటికొచ్చిన యజమాని భార్య, పిల్లలు జరిగింది చూసి నిశ్చేష్టులయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి జెన్నీఫర్‌పై కేసు నమోదు చేశారు.
ఈ కేసును విచారించిన కోర్టు ఆమెకు ఉరిశిక్ష విధించింది. అయితే, ఆమె తరపు న్యాయవాదులు పై కోర్టులో అప్పీలు చేశారు. ఆత్మరక్షణ కోసమే ఆమె అలా చేయాల్సి వచ్చిందని చెప్పడంతో కోర్టు ఉరిశిక్షను ఐదేళ్ళ శిక్షగా మార్చింది.