ఓపిక నశించింది... వరల్డ్ మ్యాప్‌లో నార్త్ కొరియాను లేకుండా చేస్తా : గర్జిస్తున్న ట్రంప్
అగ్రదేశాధినేత డోనాల్డ్ ట్రంప్ గర్జించారు. తమ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణులను విజయవంతంగా ప్రయోగిస్తుండటంతో ఆయనకు ఎక్కడలేని కోపం వస్తోంది. దీంతో ఉత్తర కొరియా పనిబట్టేందుకు ని
అగ్రదేశాధినేత డోనాల్డ్ ట్రంప్ గర్జించారు. తమ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణులను విజయవంతంగా ప్రయోగిస్తుండటంతో ఆయనకు ఎక్కడలేని కోపం వస్తోంది. దీంతో ఉత్తర కొరియా పనిబట్టేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. నార్త్ కొరియా లాంగ్ రేంజ్ న్యూక్లియర్ మిస్సైల్స్‌కు అడ్డు కట్టవేయడానికి మొత్తం ఆ దేశాన్నే నాశనం చేస్తానని ట్రంప్ తనతో అన్నట్లుగా రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ వెల్లడించారు.
గతవారం న్యూక్లియర్ బాలిస్టిక్ మిస్సైల్ పరీక్షించిన తర్వాత అమెరికాలో ఏ ప్రదేశాన్నైనా లక్ష్యంగా చేసుకునే సత్తా ఉత్తర కొరియాకు ఉందని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ హెచ్చరించిన విషయాన్ని గ్రహమ్ గుర్తు చేస్తూ ఈ వార్నింగ్‌ను ట్రంప్ కూడా సీరియస్‌గానే తీసుకున్నారు. ఐక్యరాజ్యసమితి ఆంక్షలు కూడా ఉత్తర కొరియా అణు పరీక్షలను అడ్డుకోలేకపోవడం అమెరికాలో మరింత కసిని నింపుతుందన్నారు.
ఈ నేపథ్యంలో చైనా దౌత్యం ఫలించి ఉత్తర కొరియా తమ పరీక్షలకు అడ్డుకట్ట వేస్తే సరి.. లేదంటే మిలిటరీ చర్య తీసుకోవడం తప్ప అమెరికాకు మరో దారి లేదంటూ లిండ్సే గ్రాహమ్ స్పష్టంచేశారు. ఉన్ ఇలాగే అమెరికాను రెచ్చగొడితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ట్రంప్‌తో తనతో చెప్పినట్లు గ్రాహమ్ వెల్లడించారు. తాను మాత్రం దౌత్యపరమైన చర్చలకే ప్రాధాన్యం ఇస్తానని, అదే సమయంలో అమెరికాను ఒక్క మిస్సైల్ తాకకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని గ్రాహమ్ చెప్పారు.