Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హెచ్1బి వీసాలపై డోనాల్డ్ ట్రంప్ సర్కారు ఉక్కుపాదం.. భారత టెక్కీలు వెనక్కి రావాల్సిందేనట...

తమ ఉద్యోగాలను భారతీయులతో పాటు విదేశీయులు కొల్లగొట్టుకుపోతున్నారంటా తన ఎన్నికల ప్రచారంలో గగ్గోలు పెట్టిన అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... హెచ్1బీ వీసాలపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు.

Advertiesment
Donald Trump transition team
, శుక్రవారం, 13 జనవరి 2017 (10:25 IST)
తమ ఉద్యోగాలను భారతీయులతో పాటు విదేశీయులు కొల్లగొట్టుకుపోతున్నారంటా తన ఎన్నికల ప్రచారంలో గగ్గోలు పెట్టిన అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... హెచ్1బీ వీసాలపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. ఇందులోభాగంగా, హెచ్‌1బీ, ఎల్‌1 వీసాల నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు వాటిని దుర్వినియోగం చేయడానికి ఏమాత్రం అవకాశం లేకుండా చేస్తామని అమెరికా అటార్నీ జనరల్‌ పోస్ట్‌కి ట్రంప్‌ నామినేట్‌ చేసిన సెనేటర్‌ జెఫ్‌ సెషన్స్‌ స్పష్టంచేశారు. 
 
భారతీయులు హెచ్‌1బీ వీసాల ద్వారా వచ్చి తక్కువ జీతానికి పని చేయడం వల్ల అమెరికన్లు నిరుద్యోగులవుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇకపై వీసా నిబంధనలను అత్యంత కఠినతరం చేస్తామన్నారు. సెషన్స్‌ పేర్కొన్నట్లు హెచ్‌1బీ, ఎల్‌1 వీసాలపై అమెరికా ఉక్కుపాదం మోపితే అమెరికాలో ఉంటున్న భారతీయులు కూడా ఇబ్బందులు పడకతప్పదని విదేశాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో ఉన్న టెక్కీలు చాలా మంది స్వదేశానికి తిరిగొచ్చేయాల్సి ఉంటుందని.. ఇదీ భారత ఐటీ రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు లోగిళ్ళలో భోగి సంబరాలు.. భోగిమంటల్లో పడిన వ్యక్తి... కాపాడిన ఎమ్మెల్యే మోదుగుల