Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉత్తర కొరియా దెబ్బతో ట్రంప్‌కు నిద్రపట్టట్లేదు.. చైనా సహకరిస్తే బాగుంటుందని ట్వీట్.. చూసీచూడనట్లుగా?

రియా వైమానిక స్థావరాలపై క్షిపణులతో అమెరికా విరుచుకుపడుతోంది. సిరియా అధ్యక్షుడి నేతృత్వంలో నడిచే ఈ వైమానిక స్థావరం నుంచే రసాయన దాడులు జరిగినట్టు భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశా

ఉత్తర కొరియా దెబ్బతో ట్రంప్‌కు నిద్రపట్టట్లేదు.. చైనా సహకరిస్తే బాగుంటుందని ట్వీట్.. చూసీచూడనట్లుగా?
, గురువారం, 13 ఏప్రియల్ 2017 (12:16 IST)
రియా వైమానిక స్థావరాలపై క్షిపణులతో అమెరికా విరుచుకుపడుతోంది. సిరియా అధ్యక్షుడి నేతృత్వంలో నడిచే ఈ వైమానిక స్థావరం నుంచే రసాయన దాడులు జరిగినట్టు భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు క్షిపణిదాడులు జరిగాయి. మధ్యదరా సముద్రంలో అమెరికా యుద్ధ నౌక నుంచి మొత్తం 50 వరకు తోమాహక్ క్షిపణులను సిరియా పైకి ప్రయోగించినట్టు అమెరికా సైనికాధికారి తెలిపారు.
 
సిరియాలో జరిగిన రసాయన దాడులకు ప్రతీకార చర్యగానే ట్రంప్ క్షిపణి దాడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.  ఖాన్ షిఖావున్ నగరంపై జరిగిన రసాయన దాడిలో మొత్తం 70 మందికి పైగా చనిపోగా... అందులో చాలామంది ముక్కుపచ్చలారని చిన్నారులే ఉండడంతో ప్రపంచం యావత్తూ కలవరపాటుకు గురైంది. ఈ నేపథ్యంలో సిరియాపై దాడుల అనంతరం ట్రంప్ మాట్లాడుతూ అమెరికా న్యాయానికి కట్టుబడి ఉంటుందని ప్రకటించారు. 
 
రసాయనిక దాడుల్లో సిరియాలోని అమాయక ప్రజలు మరణించారని దానికి ప్రతీకారంగానే దాడులు చేశామని ట్రంప్ పేర్కొన్నారు. జాతీయ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా తాము సిరియాపై దాడి చేసినట్లు ఆయన వివరించారు. సిరియాపై అమెరికా దాడులు చేయడం ద్వారా పరోక్షంగా చైనాకు హెచ్చరిక చేసినట్లయింది.
 
అయితే ట్రంప్ చర్యలు ఉత్తర కొరియాను రెచ్చగొట్టాయి. అమెరికాపై దాడులు చేసేందుకు ఉత్తర కొరియా సిద్ధమని ప్రకటించిన నేపథ్యంలో ఉత్తర కొరియాను అదుపు చేయడానికి చైనా సహకరిస్తే బావుంటుందని డొనాల్డ్ ట్రంప్‌ భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్వీట్‌ ద్వారా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే, ట్రంప్‌ ట్వీట్‌ను చైనా చూసి చూడనట్లు ఊరుకుంది. ఉత్తర కొరియా సముద్ర జలాల చేరువలోకి అమెరికా యుద్ధ నౌకలు వెళ్లడంతో ఆ దేశం అమెరికాపై అణుదాడికి తాము వెనుకాడమని ప్రకటించింది.
 
ఉత్తరకొరియా ప్రకటనతో ఒక్కసారిగా ప్రపంచదేశాలు షాక్‌కు గురయ్యాయి. అగ్రరాజ్యంపై ఉత్తరకొరియా వ్యాఖ్యల ధైర్యాన్ని చూసి అనేక దేశాలు నివ్వెరపోయాయి. ఉత్తరకొరియా కలవరం ట్రంప్‌ను నిద్రపోనిస్తున్నట్లు కనిపించడం లేదు. అందుకే చైనా ద్వారా ఆ దేశానికి చెక్‌ పెట్టాలని ట్రంప్‌ యోచిస్తున్నట్లు స్పష్టమవుతోంది. చైనాతో అమెరికాకు మంచి సంబంధాలు ఉన్నాయని.. ఆ దేశాధ్యక్షుడు జిన్‌ పింగ్‌తో తన కెమిస్ట్రీ బాగుందంటూ ట్రంప్‌ బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
 
మంగళవారం జిన్‌ పింగ్‌కు ట్రంప్‌ ఫోన్‌ చేశారు. వ్యాపార సంబంధాల విషయం గురించే కాక మరెన్నో అంశాలు చర్చించుకున్నామని మీడియాతో చెప్పుకొచ్చారు ట్రంప్‌. చైనాతో మంచి వ్యాపారసంబంధాలు పెంచుకోవడం వల్ల ఉత్తరకొరియాను అదుపు చేయడం సులువు అవుతుందని తాను అనుకుంటున్నట్లు వివరించారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'మహిళల శరీరసౌష్టవ అత్యుత్తమ కొలతలు' 36–24–36... సీబీఎస్‌ఈ సిలబస్‌లో...