Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బై అమెరికన్.. హైర్ అమెరికన్ అంటున్న ట్రంప్

ప్రపంచీకరణకు మించింది లేదంటూ కమ్యూనిస్టు దేశం చైనా సమర్థిస్తుండగా, ప్రపంచీకరణ లేదు ఏమీ లేదు.. అమెరికనీకరణే బెటర్ అని ట్రంప్ అంటున్నాడు. ఇది చైనా ఆర్థిక దూకుడుతనాన్ని, అమెరికా ఆర్థిక పతనాన్ని చూపిస్తున్నాయని పరిశీలకుల వ్యాఖ్య.

Advertiesment
బై అమెరికన్.. హైర్ అమెరికన్ అంటున్న ట్రంప్
హైదరాబాద్ , శనివారం, 21 జనవరి 2017 (01:59 IST)
అమెరికా 45వ అధ్యక్షుడిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ మూడే ముక్కల్లో తన భవిష్యత్ విధానాల గురించి చెప్పేశారు. నాలుగేళ్ల పాలన మొత్తం వీటి చుట్టే తిరుగుతుందని చెప్పకనే చెప్పేశారు. అవేమిటంటే...
 
1. అమెరికా సంయుక్తరాష్ట్రాలను అగ్రస్థానంలో నిలుపడంపైనే దృష్టి మొత్తం పెడతాను
2. అమెరికన్ ప్రజలకు ఒకే విజ్ఞప్తి.. అమెరికన్ వస్తువులనే కొనండి. అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించండి. 
3. నా విజయం సగటు అమెరికన్ విజయం. అందుకే శుష్క ప్రసంగాలకు సమయం ముగిసింది. అమెరికన్ల ప్రయోజనాల గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.
4. అమెరికా ఇప్పటివరకు ఇతర దేశాలను సంపన్న దేశాలుగా మార్చింది. ఈ క్రమంలో అమెరికా మౌలిక వసతుల వ్యవస్థ గబ్బుపట్టిపోయింది.
5. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, మరిన్ని ఉద్యోగాలు సృష్చించడమే ప్రభుత్వ కర్తవ్యం. 
6. రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని నిర్మూలించనిదే నిద్రపోను.
7. బాహ్య ప్రంపంచంలోకి తొంగి చూసే విధానాలను తొలిగిస్తాం. అమెరికా లోపలి అభివృద్ధినే పట్టించుకుంటాం. 
8. అమెరికాకు ఇప్పుడు కావలిసింది జాతిపరమైన సమైక్యత. మనది నల్లజాతి, గోధుమ వర్ణ జాతి లేదా శ్వేత జాతి ఏదైనా కానివ్వండి. మనందరిలో అమెరికన్ దేశభక్తుల  రక్తమే ప్రవహిస్తోంది.
9. అమెరకన్ ప్రజలారా.. భవిష్యత్తు గురించి భయపడకండి.. మార్పు ఇప్పటికే ప్రారంభమైంది. 
10. తుది శ్వాస ఉన్నంత వరకు మీకోసం పోరాడతాను. అమెరిన్లు ఎన్నటికీ తలవంచుకునేలా చేయను. 
 
అమెరికా 70 సంవత్సరాల క్రితం కొనసాగించిన స్వీయ రక్షిత వాద విధానాలను (తన కొంప తాను చూసుకునే విధానం) ట్రంప్ మళ్లీ తీసుకువస్తున్నట్లు పై సంకేతాలు సూచిస్తున్నాయి. ప్రపంచీకరణకు మించింది లేదంటూ కమ్యూనిస్టు దేశం చైనా సమర్థిస్తుండగా, ప్రపంచీకరణ లేదు ఏమీ లేదు.. అమెరికనీకరణే బెటర్ అని ట్రంప్ అంటున్నాడు. ఇది చైనా ఆర్థిక దూకుడుతనాన్ని, అమెరికా ఆర్థిక పతనాన్ని చూపిస్తున్నాయని పరిశీలకుల వ్యాఖ్య.
 
ట్రంప్ తన అధ్యక్షోపన్యాసంలో చెప్పిన అమెరికనీకరణ ప్రపంచాన్ని ఎన్ని కల్లోలాల్లోకి నెట్టి వేస్తుందో ఫలితాలు అప్పుడే కనిపిస్తున్నాయి. ఇన్ఫోసిస్ తన 30 ఏళ్లకు పైగా చరిత్రలో తొలిసారిగా ఒకోసారి 9 వేలమంది ఉద్యోగులను 2016లో ఇంటికి పంపించేసింది. ట్రంప్ దెబ్బకు ప్రపంచ సాఫ్ట్ వేర్ రంగం ఎలా కుదేలవనుందో చెప్పే ప్రారంభ సూచిక మాత్రమే..
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శభాష్ తమిళనాడు... ఐకమత్యంతో సాధించారు... జల్లికట్టు ఆర్డినెన్స్ రాష్ట్రపతికి...