ఐరాసపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు.. సరాదాగా కాలక్షేపం చేసుకునే వారికి అదో క్లబ్ అట..
అమెరికాలో ముస్లింల ప్రవేశాన్ని అడ్డుకుంటానని, ముస్లింలపై నిషేధం విధిస్తానని చెబుతున్న నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అధ్యక్షుడు ఒరాక్ ఒబామా షాక్ ఇచ్చారు. టెర్రరిస్టు ప్రభావిత దేశాల నుంచి వచ్చే
అమెరికాలో ముస్లింల ప్రవేశాన్ని అడ్డుకుంటానని, ముస్లింలపై నిషేధం విధిస్తానని చెబుతున్న నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అధ్యక్షుడు ఒరాక్ ఒబామా షాక్ ఇచ్చారు. టెర్రరిస్టు ప్రభావిత దేశాల నుంచి వచ్చే యాత్రికులను నియంత్రించే నేషనల్ సెక్యూరిటీ ఎంట్రీ- ఎగ్జిట్ రిజిస్ట్రేషన్ (ఎన్‌ఎస్‌ఈఈఆర్‌ఎస్) చట్టాన్ని 2001 సెప్టెంబర్ 11 దాడుల తరువాత తీసుకువచ్చింది. దీంతో 2001-2011 వరకు కఠిన నిబంధనలు అమలులో ఉండేవి.
తాజాగా జరిగిన బెర్లిన్ ఉగ్ర దాడి అనంతర ముస్లింలపై నిషేధం అవసరమని ట్రంప్ సృష్టం చేశారు. దీంతో ఈ చట్టాన్ని రద్దు చేస్తూ ఒబామా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయినా డొనాల్డ్ ట్రంప్ నోటి దురుసు ఏమాత్రం తగ్గలేదు. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ఐక్యరాజ్య సమితిని దారుణంగా విమర్శించారు. ఐక్యరాజ్య సమితి సమర్థతను దుయ్యబట్టారు. సరదాగా కాలక్షేపం చేయాలనుకొనేవారికి అదొక క్లబ్బు వంటిదంటూ ఎద్దేవా చేశారు.
వస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలెంలలో ఇజ్రాయేల్ పౌరులు ఆవాసాలను ఏర్పాటు చేసుకోవడాన్ని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి శుక్రవారం తీర్మానాన్ని ఆమోదించింది. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్‌లో ఐక్యరాజ్య సమితికి విస్తృత సామర్థ్యం ఉందని, అయితే అది సరదాగా కాలక్షేపం చేసేవారి క్లబ్బుగా మారిందని విమర్శించారు. ఇది చాలా విచారకరమన్నారు.