Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గ్లామ‌ర్‌ను వ‌దిలేసి.. నామీద ప‌డటం వల్లే ఆస్కార్‌లో తప్పుదొర్లింది : డోనాల్డ్ ట‌్రంప్‌

గ్లామర్‌ను వదిలేసి నామీద దృష్టిపెట్టడం వల్లే ఆస్కార్ అవార్డుల్లో భాగంగా ఉత్తమ చిత్రం ఎంపికలో పొరపాటు జరిగిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. లాస్ ఏంజిల్స్ కేంద్రంగా సోమ‌వారం ఆస్క

గ్లామ‌ర్‌ను వ‌దిలేసి.. నామీద ప‌డటం వల్లే ఆస్కార్‌లో తప్పుదొర్లింది : డోనాల్డ్ ట‌్రంప్‌
, మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (12:44 IST)
గ్లామర్‌ను వదిలేసి నామీద దృష్టిపెట్టడం వల్లే ఆస్కార్ అవార్డుల్లో భాగంగా ఉత్తమ చిత్రం ఎంపికలో పొరపాటు జరిగిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. లాస్ ఏంజిల్స్ కేంద్రంగా సోమ‌వారం ఆస్కార్ ఈవెంట్‌ క్లైమాక్స్ ద‌శ‌లో ఉత్త‌మ చిత్రం ప్ర‌క‌ట‌న అంశంలో త‌ప్పిదం జ‌రిగింది. తొలుత "లా లా లాండ్‌"ను ఉత్త‌మ చిత్రంగా ప్ర‌క‌టించి, ఆ త‌ర్వాత "మూన్‌లైట్" చిత్రాన్ని బెస్ట్ పిక్చ‌ర్‌గా ప్ర‌క‌టించారు. దీంతో ఆస్కార్ ప్ర‌దానంలో పెద్ద పొర‌పాటు జ‌రిగినట్టయింది. ఈ ఘ‌ట‌న‌పై బ్రీట్‌బార్ట్ న్యూస్ వెబ్‌సైట్ ప్రెసిడెంట్ అభిప్రాయాన్ని సేక‌రించింది. 
 
గ్లామ‌ర్‌ను వ‌దిలేసి, అతిగా రాజ‌కీయాల‌పై దృష్టిపెట్ట‌డం వ‌ల్లే ఆస్కార్ వేడుక‌ల్లో పొర‌పాటు జ‌రిగిందని అభిప్రాయ‌ప‌డ్డారు. హాలీవుడ్ అతిగా త‌న గురించి ఆలోచించ‌డం వ‌ల్లే ఆస్కార్ వేడుక‌లో అప‌శృతి చోటుచేసుకున్న‌ట్లు పేర్కొన్నారు. ఆస్కార్ నిర్వాహ‌కులు రాజ‌కీయాల‌పై అతిగా దృష్టిపెట్టార‌ని విమ‌ర్శించారు. ఇది చాలా విషాద‌క‌ర‌మ‌ని, ఆస్కార్స్‌కు ఉన్న గ్లామ‌ర్ ఆ ఘ‌ట‌న దూరం చేసింద‌ని ట్రంప్ అన్నారు. ఆస్కార్ వేడుక‌గా ఓ గ్లామ‌ర్ ఈవెంట్‌లా జ‌ర‌గ‌లేద‌ని, గ‌తంలో తాను ఆస్కార్ వేడుక‌ల్లో పాల్గొన్నాన‌ని, ఏదో మిస్సైన‌ట్లు అనిపించింద‌ని, ఆ వేడుక చివ‌ర్లో జ‌రిగిన త‌ప్పిదం ప‌ట్ల బాధేస్తుంద‌ని చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీనివాస్ హత్య కలచివేసింది.. జాతి విద్వేషపూరిత చర్యగా అభివర్ణించొద్దు : వైట్‌హౌస్