Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహిళలను ముద్దాడేందుకు, శృంగారానికి డొనాల్డ్ ఏం చేసేవాడంటే.. సారీ చెప్పారు..

అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. 2005లో మహిళలపై చేసిన అశ్లీల వ్యాఖ్యల వీడియో ఒకటి బయటపడింది. పెళ్లయిన మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినట

మహిళలను ముద్దాడేందుకు, శృంగారానికి డొనాల్డ్ ఏం చేసేవాడంటే.. సారీ చెప్పారు..
, ఆదివారం, 9 అక్టోబరు 2016 (12:19 IST)
అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. 2005లో మహిళలపై చేసిన అశ్లీల వ్యాఖ్యల వీడియో ఒకటి బయటపడింది. పెళ్లయిన మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆయన చెప్పడం అందులో ఉంది.

‘యాక్సెస్‌ హాలీవుడ్‌’ కార్యక్రమం ప్రజెంటర్‌ బిల్లీ బుష్‌తో మాట్లాడుతూ.. మహిళలను ముద్దాడేందుకు, శృంగారానికి తాను చేసిన ప్రయత్నాలను వివరించిన వైనం మైక్రోఫోన్‌లో చిక్కింది. 
 
స్టార్‌లు ఏదైనా చేస్తే చేయించుకోవడానికి మహిళలు సిద్ధంగా ఉంటారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇది ఎన్నికల వేళ ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ పత్రికకు చిక్కింది. న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక కూడా ట్రంప్‌-బిల్లీల సంభాషణను ప్రచురించింది. దీనిపై హిల్లరీ మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తిని అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టరాదని స్పష్టం చేశారు.

అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి ఆయన వైదొలగాలని మరికొందరు సీనియర్లు డిమాండ్‌ చేయడంతో ట్రంప్‌ కలవరపడ్డారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయాక క్షమాపణ చెబుతూ ఫేస్‌బుక్‌లో టేప్‌ పోస్ట్‌ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లిక్విడ్ ఫుడ్ తీసుకుంటున్న జయలలిత.. అపోలో రోగులకు ఫ్రీ ఆటో..