Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశాధ్యక్షుడు ఫుల్ సూట్‌లో.. ప్రథమ మహిళ బేబీ సూట్‌లో..

అమెరికా 45వ అధ్యక్షుడిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ ఆద్యంతం ఫుల్ సూట్‌లో మెరిసిపోతుంటే ఆయన భార్య, ప్రధమ మహిళ మెలనియా ట్రంప్ బేబీ బ్లూ డ్రస్‌లో వెలిగిపోయారు. లేత నీలం రంగులో మెరిసిపోయిన మెలనియా ట్రంప్ చాలామందికి అమెరికా పూర్వ అధ్య

Advertiesment
Donald Trump
హైదరాాబాద్ , శనివారం, 21 జనవరి 2017 (05:02 IST)
అమెరికా 45వ అధ్యక్షుడిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ ఆద్యంతం ఫుల్ సూట్‌లో మెరిసిపోతుంటే ఆయన భార్య, ప్రధమ మహిళ మెలనియా ట్రంప్ బేబీ బ్లూ డ్రస్‌లో వెలిగిపోయారు. లేత నీలం రంగులో మెరిసిపోయిన మెలనియా ట్రంప్ చాలామందికి అమెరికా పూర్వ అధ్యక్షుడు జాన్ కెన్నడీ సతీమణి జాక్వెలిన్‌ను తలపించారు. 1961లో జాన్ కెన్నడీ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకరించినప్పుడు ఆయన సతీమణి కూడా మెలనియా ట్రంప్‌లాగే బేబీ సూట్ వేసుకుని వచ్చారు. 
 
అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా హిల్లరీ క్లింటన్‌కు అనుకూలంగా పనిచేసిన ఎంతోమంది ఫ్యాషన్ డిజైనర్లు ట్రంప్ గెలిచినా తామెవరమూ ఆయన కుటుంబానికి డ్రెస్ డిజైన్ చేయబోమని శపథం చేశారు. ఈ నేపథ్యంలో మెలనియా ట్రంప్ ఏ ఫ్యాషన్ డిజైనర్‌ రూపొందించిన డ్రస్‌ను ధరిస్తారన్న కుతూహలం అమెరికన్లలో పెరిగిపోయింది. 
 
ప్రముఖ డిజైనర్ రాల్ఫ్ లారెన్‌ను ఎంచుకున్న మెలనియా ట్రంప్ బేబీ బ్లూ దుస్తులను తన భర్త ప్రమాణ స్వీకారోత్సవ సందర్భంగా ధరించారు. అనేక మంది ఫ్యాషన్ వీక్షకులు ఆమె ధరించిన దుస్తులు కెన్నడీ ప్రమాణ స్వీకారోత్సవ సందర్భగా నాటి ప్రథమ మహిళ జాక్వెలిన్ దుస్తులను తలిపించాయని గుర్తు చేసుకున్నారు.
 
లేత నీలం దుస్తుల్లో మెలనియా మెరిసిపోతే, పదవినుంచి దిగిపోనున్న ఒబామా సతీమణి మిషెల్ బెల్ట్ ధరించిన మెరూన్ డ్రెస్‌లో సింపుల్‌గా ప్రత్యక్షమైంది. మిషెల్ బిగుతైన దుస్తుల్లో ఉండటాన్ని బాగా ఇష్టపడుతుందని తెలుసు. అది ఏ డిజైనరూ రూపొందించని తనదైన సొంత స్టయిల్ అన్నమాట.

అయితే మెలనియా కానీ, మిషెల్ కానీ సాదా సీదా దుస్తులతోనే కనిపించారని, శ్వేతసౌదంలో ఉంటున్నా, ఉండబోతున్నా, సింప్లిసిటీని దూరం చేసుకోని ఆ ఇద్దరి తత్వానికి వారు వేసుకున్న దుస్తులు అద్దం పట్టాయని పరిశీలకుల వ్యాఖ్య.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిజర్వేషన్ల కొనసాగింపు అవసరమా: ఆరెస్సెస్ బాంబుతో బీజేపీ గుండెల్లో రాయి