అందాన్ని బట్టి మహిళలకు రేటింగ్ ఇవ్వడం ట్రంప్ శైలి : ఫెమినిస్ట్ గ్లోరియా స్టీనిమ్
అమెరికా అధ్యక్ష పీఠం ఎన్నికల సమయం సమీపిస్తుండే కొద్దీ... ఈ పదవి కోసం పోటీపడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌పై ఆరోపణలు చేసే మహిళల జాబితా నానాటికీ పెరిగిపోతోంది. ఇప్పటికే ఆ దేశ మహిళల న
అమెరికా అధ్యక్ష పీఠం ఎన్నికల సమయం సమీపిస్తుండే కొద్దీ... ఈ పదవి కోసం పోటీపడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌పై ఆరోపణలు చేసే మహిళల జాబితా నానాటికీ పెరిగిపోతోంది. ఇప్పటికే ఆ దేశ మహిళల నుంచి ట్రంప్ తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. తాజాగా ప్రముఖ ఫెమినిస్ట్ గ్లోరియా స్టీనిమ్ విరుచుకుపడ్డారు.
ట్రంప్‌కు మహిళలపై గౌరవం లేదన్నారు. తన సంస్థల్లో మహిళలు ఎదగడానికి దోహదపడతానని ట్రంప్ చెబుతున్నప్పటికీ... స్త్రీలపై ఆయనకు ఉన్న చులకన భావాన్ని ఈ వ్యాఖ్యలు కప్పిపుచ్చలేవన్నారు. అందాన్ని బట్టి మహిళలకు రేటింగ్ ఇవ్వడం ట్రంప్ శైలి అని... 10కి 10 రేటింగ్ ఉన్న మహిళలనే ట్రంప్ లక్ష్యంగా పెట్టుకుంటాడని తెలిపారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌పై ఆరోపణలు వచ్చినప్పుడు గ్లోరియా స్టీనిమ్ వాటిపై దర్యాప్తు చేశారు. అయితే, ట్రంప్‌తో పోల్చుకుంటే క్లింటన్ కేసులు కొంచెం భిన్నమైనవని ఆమె అభిప్రాయపడ్డారు.