Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికాకు వలసొచ్చినవాళ్లు దొంగలన్న ట్రంప్: ప్లేబాయ్‌గా మ్యాగజైన్‌ కోసం ఫోజులు..

ఈ ఏడాది నవంబర్‌ 8న దేశాధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్‌ పార్టీ తరపు అభ్యర్థిగా డోనాల్డ్‌ ట్రంప్‌ పేరు ఖరారు కావడంతో ఎన్నికల సమరం మరింత వేడెక్కింది. ఇప్పటివరకూ అనేక అంశాలపై వివాదాస్పద ప్రకటనలు

Advertiesment
అమెరికాకు వలసొచ్చినవాళ్లు దొంగలన్న ట్రంప్: ప్లేబాయ్‌గా మ్యాగజైన్‌ కోసం ఫోజులు..
, గురువారం, 6 అక్టోబరు 2016 (13:40 IST)
ఈ ఏడాది నవంబర్‌ 8న దేశాధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్‌ పార్టీ తరపు అభ్యర్థిగా డోనాల్డ్‌ ట్రంప్‌ పేరు ఖరారు కావడంతో ఎన్నికల సమరం మరింత వేడెక్కింది. ఇప్పటివరకూ అనేక అంశాలపై వివాదాస్పద ప్రకటనలు గుప్పించిన ట్రంప్ ఎన్నికల సందర్భంగా మరోసారి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు వలసొచ్చినవాళ్లు దొంగలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
వలసల దేశంగా పేరున్న అమెరికా అధ్యక్షస్థానానికి పోటీచేస్తున్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మైఖేల్ ఒబామా స్పీచ్‌ను తన భార్య దొంగిలించిందంటూ మరో వ్యాఖ్య చేశారు ట్రంప్. వ్యక్తిగతంగా దూకుడుగా కనిపించే డొనాల్డ్ ట్రంప్‌కు మహిళల పట్ల గౌరవం లేదని అతను మాజీ మిస్ యూనివ‌ర్స్ అలిసియాను కించ‌ప‌రుస్తూ చేసిన వాఖ్యలే దీనికి సాక్ష్యం అని హిల్లరీ క్లింటన్ విమర్శించిన సంగతి తెల్సిందే. దీంతో ట్రంప్ ఇమేజ్ మరింత డ్యామేజీ అయింది. 
 
తాజాగా ట్రంప్ ప్లేబాయ్ అన్న ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఆ ఫేమ‌స్ మ్యాగ‌జైన్‌‍ కోసం ఆయ‌న‌ ఫోటోలు, వీడియోలు తీశారట‌. ట్రంప్ ఒక‌ప్పుడు ప్లేబాయ్ మ్యాగజైన్‌లో హ‌ల్‌చ‌ల్ చేయడం అందరిని అబ్బురపరిచింది. ర‌సిక‌రాజు ట్రంప్ అంటూ కామెంట్స్ కూడా వ‌స్తున్నాయి. 1994లో ప్లేబాయ్ మ్యాగజైన్‌లో కోసం ట్రంప్ ఓ మోడ‌ల్‌ను ఇంట‌ర్వ్యూ చేశారు. ఫోటోకు కావ‌ల్సిన‌వ‌న్నీ ఆమె ద‌గ్గర ఉన్నాయంటూ అప్పట్లో దానికి ట్రంప్ కామెంట్ చేశార‌ట‌. 
 
2000 సంవత్సరంలోనూ మ‌రో ప్లేబాయ్ వీడియోలో ట్రంప్ ఫుల్‌ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఆ వీడియోలో అత‌ను పూర్తి దుస్తుల‌తోనే ఉన్నా, మోడ‌ల్స్ మాత్రం వివిధ భంగిమ‌ల్లో హాట్‌హాట్‌గా క‌నిపిస్తున్నారు. ట్రంప్ ఇలా ప్లేబాయ్ మ్యాగ్జిన్ మోడ‌ల్స్‌తో ఫోటోలు దిగిన ఆధారాలు ఇప్పుడు ఆ పార్టీకి అధ్యక్ష ఎన్నిక‌ల్లో మైన‌స్‌గా మారే అవ‌కాశాలున్నాయి. 1990లో ప్లేబాయ్ మ్యాగజైన్‌ క‌వ‌ర్‌పేజీ మీద కూడా ట్రంప్ క‌నిపించారు. మొత్తానికి ట్రంప్ మాంచి రసిక రాజు అని అమెరికన్లు గుసగుసలాడుకుంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్‌పై మరిన్ని దాడులు చేయాలి.. భారత్ సర్జికల్ దాడులు సబబే : జర్మనీ