Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ట్రంప్ ఉన్నంతవరకు అమెరికాకు వెళ్లొద్దు: ప్రపంచ దేశాల శపథం: పర్యాటకం ఢమాల్

ట్రంప్ దెబ్బకు అమెరికా సీన్‌ రివర్స్‌ అయింది. గతంలో ఇతర దేశాల్లో ఏదైనా సమస్యలు వచ్చినపుడు అక్కడు వెళ్లవద్దంటూ అమెరికా తమ పౌరులకు.. పర్యాటకులకు హెచ్చరికలు జారీ చేసేది. కానీ ఇప్పుడు ఇతర దేశాలు అమెరికాకు వెళ్లవద్దంటున్నాయి.

Advertiesment
ట్రంప్ ఉన్నంతవరకు అమెరికాకు వెళ్లొద్దు: ప్రపంచ దేశాల శపథం: పర్యాటకం ఢమాల్
హైదరాబాద్ , సోమవారం, 6 మార్చి 2017 (08:17 IST)
ట్రంప్ దెబ్బకు  అమెరికా సీన్‌ రివర్స్‌ అయింది. గతంలో ఇతర దేశాల్లో ఏదైనా సమస్యలు వచ్చినపుడు అక్కడు వెళ్లవద్దంటూ అమెరికా తమ పౌరులకు.. పర్యాటకులకు హెచ్చరికలు జారీ చేసేది. కానీ ఇప్పుడు ఇతర దేశాలు అమెరికాకు వెళ్లవద్దంటున్నాయి. కారణం ట్రంప్‌. అమెరికాకు పొరుగునే ఉన్న కెనడా అయితే.. ట్రంప్‌ పదవీకాలం పూర్తయ్యే దాకా అమెరికాకు ఎవరూ వెళ్లవద్దని తమ దేశ పర్యాటకులకకు సూచిస్తోంది. కొందరు కెనడియన్లు అయితే.. తాము ఇప్పటికే బుక్‌ చేసుకున్న అమెరికా విహార యాత్రలను కూడా రద్దు చేసుకుంటున్నారు. ఇతర దేశాల్లోనూ ఇదే తీరు.

ట్రంప్‌.. ముస్లిం దేశాలపై నిషేధాన్ని ప్రకటించిన తర్వాత అమెరికాకు వెళ్లడానికి అన్ని దేశాల పౌరులూ భయపడుతున్నారు. పర్యాటకులు లేకుండా అమెరికాలోని హోటెళ్లు వెలవెలబోయే పరిస్థితి నెలకొంది. ఒక్క మాటలో చెప్పాలంటే ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడయ్యాక అక్కడి పర్యాటక రంగానికి రూ.1221 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు నిపుణులు అంచనా వేశారు.
 
ట్రంప్‌ అధ్యక్షుడైన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాలంలో పర్యాటకులు శోధించిన ప్రాంతాల్లో అమెరికాలోని పర్యటన ప్రాంతాలు చివరి వరుసకు చేరాయి. ప్రముఖ ట్రావెల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ క్యాక్‌ వెల్లడించిన వివరాల మేరకు.. బ్రిటన్లో ఉండేవారు 60 శాతం పైగా అమెరికా పర్యటన గురించి ఆలోచించడం మానేశారు. ప్రపంచ వ్యాప్తంగా 40 దాకా శాతం పర్యటకులు ఆమెరికా ఆలోచనలను మానుకున్నారు. గతేడాదితో పోల్చితే ప్రస్తుతం అమెరికాలో హోటెళ్ల ధరలు 30-40 శాతం తగ్గిపోయాయి. ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక పర్యటకుల రాక గణనీయంగా తగ్గిందని అమెరికాలోని హోటెళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. అందువల్లే తాము 40 శాతం వరకు చార్జీలను తగ్గించాల్సి వచ్చిందని వివరించారు. 
 
ఇక అమెరికాకు వెళ్లే విమానాలను అన్వేషించేవారి సంఖ్యా ఇప్పుడు 20-30 శాతం తగ్గిపోయినట్లు హోపర్‌ అనే ట్రావెల్‌ వెబ్‌సైట్‌ వెల్లడించింది. మొత్తానికి అమెరికాకు వెళ్లే విమానాలకు 94 దేశాల్లో డిమాండ్‌ తగ్గిపోయింది. మొత్తం 122 దేశాల నుంచి అమెరికాకు విమానాలు వెళ్తుంటాయి. కాగా రష్యాలో మాత్రం ట్రంప్‌ అధ్యక్షుడైన తర్వాత అమెరికా వెళ్లేవారు పెరిగారు. ఇక్కడ గత నెలలో 88 శాతం మేర అమెరికాకు వెళ్లే పర్యాటకుల వృద్ధి నమోదైంది. మొత్తానికి గత రెండు నెలలుగా అమెరికాకు వెళ్లే పర్యటకుల సంఖ్య తగ్గిపోతుండగా.. యూర్‌పకు వెళ్లేవారు పెరుగుతున్నారు. 
 
అమెరికాకు పర్యాటకులు తగ్గడం.. అక్కడకు వెళ్లాలంటే భయపడుతున్న నేపథ్యంలో ఆ పర్యాటకులను ఆకర్షించడానికి ఇతర దేశాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా లాటిన్‌ అమెరికా దేశాలు మెక్సికో, బ్రెజిల్‌.. ఇతర దేశాలు సింగపూర్‌, న్యూజిలాండ్‌, ఆస్ర్టేలియాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఇందుకోసం పలు ప్యాకేజీలను ప్రకటించడంతో పాటు.. హోటెళ్ల చార్జీలను బాగా తగ్గిస్తున్నాయి.
 
ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నంత వరకు అమెరికాకు వెళ్లవద్దని కెనడా తమ పౌరులకు సూచిస్తోంది. కెనడాలోని వివిధ వార్తా పత్రికలు సైతం అమెరికా పర్యటనకు వెళ్లవద్దని.. ఇప్పుడు వెళితే లేని పోని చిక్కులు వస్తాయని పేర్కొంటూ పలు వ్యాసాలను ప్రచురిస్తున్నాయి. అమెరికాలోని ఇతర దేశాలకు చెందిన రాయబార కార్యాలయాలు.. సంస్థలు ఇప్పుడు అమెరికా పర్యటనకు వద్దని తమ పౌరులకు సూచిస్తున్నాయి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మావాళ్లకు ఒక్క సీటూ ఇవ్వరా.. తేల్చుకుంటామంటున్న ముస్లింలు: కాశీలో కమలం కొంప మునిగేనా?