Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సౌర కుటుంబం అవతల ఏముందో తెలుసా?... నాసా సంచలన ప్రకటన

సౌర కుటుంబం అవతల ఏముందో తెలుసా?... నాసా సంచలన ప్రకటన
, బుధవారం, 20 జనవరి 2021 (14:03 IST)
అమెరికా స్పేస్ రీసెర్చ్ సంస్థ  నాసా ప్రత్యేక అద్భుతమైన ఫొటోని ప్రపంచానికి తన ఇన్ స్టాగ్రామ్ పేజీ ద్వారా షేర్ చేసింది. ఇందులో ఓ భారీ సూపర్‌ నోవా ఉంది. దీన్ని చంద్ర ఎక్స్ రే అబ్జర్వేటరీ కనిపెట్టింది. ఈ పేలుడు ఇప్పుడు జరిగింది కాదు. 2016 లో జరిగింది.

సూపర్ నోవా 103 మధ్యలో మెరుస్తున్న కాంతిని నాసా కాప్చర్ చేసింది. ఈ సూపర్‌ నోవా మన భూమికి 10,700 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే ఇది మన సౌర కుటుంబనికి అవతల ఉందన్నమాట . ఇదివరకు ఇలాంటి చాలా ఫొటోలను నాసా మనకు షేర్ చేసింది. వాటికీ దీనికీ ఓ తేడా ఉంది.

ఇలా సూపర్ నోవా ఏర్పడ్డాక ... నక్షత్రాన్ని కాప్చర్ చేయడం ఇదే తొలిసారని తెలుస్తోంది. ఏదైనా అతి భారీ నక్షత్రం ... కొన్ని వందల కోట్ల సంవత్సరాల తర్వాత ... కుచించుకుపోతూ ... చిన్నగా అయిపోతుంది. ఆ తర్వాత ఒక్కసారిగా పేలిపోతుంది.

ఆ పేలుడుతో ... దానికి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలోని గ్రహాలు, ఇతరత్రా అన్నీ అందులో కలిసిపోతాయి . ఇలా సూపర్‌నవా ఏర్పడనప్పుడు పేలిపోయిన నక్షత్రంలోని మధ్య భాగం మరో నక్షత్రం ( న్యూట్రాన్ స్టార్) లా కనిపిస్తుంది. అది చిన్నగా ఉన్నా దానిలో మాస్ 10 నుంచి 25 సోలార్ మాన్లకు సమానంగా ఉంటుంది.

ఆ నక్షత్రం మెటల్ రిచ్ అయితే ... మాస్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. దాని వయసు 2000 సంవత్సరాలుగా అంచనా వేస్తున్నారు. ఇక్కడ నాసా ఓ ఆసక్తికర విషయం చెప్పింది. న్యూట్రాన్ స్టార్ లో పదార్థం బలవంతంగా ప్యాక్ అవ్వడం వల్ల అది చాలా బరువుగా ఉంటుందట.

ఆ నక్షత్రం నుంచి మనం ఓ పంచదార పలుకు అంత సైజు పదార్థాన్ని తీసి తూకం వేస్తే ... అది ఎవరెస్ట్ పర్వతం అంత బరువు ఉంటుందట. అందుకే ఈ పోస్ట్ అందరికీ తెగ నచ్చుతోంది. దీనికి 20 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. చాలా మంది ఇది అద్భుతంగా ఉందని అంటున్నారు.

ఈ సూపర్ నోవా లాగానే 500 కోట్ల సంవత్సరాల తర్వాత మన సూర్యుడు కూడా కుచించుకుపోయి చిన్నగా అయ్యి ఒక్కసారిగా పేలిపోతాడనీ ఆ పేలుడుతో వచ్చే మంటలు, ఎనర్జీ దాటికి సౌర కుటుంబంలోని అన్ని గ్రహాలు, గ్రహశకలాలూ అల్లకల్లోలం అవుతాయని సైంటిస్టులు చెబుతున్నారు.

ఈ విపత్తు నుంచి మనం బయటపడటానికి మనకు 500 కోట్ల సంవత్సరాల టైమ్ మాత్రమే ఉంది. ఈ లోగా మనం ఇతర గ్రహాల పైకి వెళ్లి అక్కడి నుంచి సౌర కుటుంబం అవతలికి వెళ్లి అక్కడి నుంచి ఇతర సూర్యుళ్ల చుట్టూ తిరిగే భూమి లాంటి గ్రహాలను చేరుకోవాల్సి ఉంటుంది.

అందుకు చాలా టైమ్ ఉందిగా అని సైంటిస్టులు అనుకోవట్లేదు. ఇప్పటి నుంచే అలాంటి ప్రయత్నాలు చేస్తేనే ... ఎప్పటికైనా సుదూర తీరాలకు వెళ్లగలం అని లెక్కలు వేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రిటన్‌ లో కరోనా మరణాల రికార్డు