Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌, చైనాకు వెళ్ళొద్దు.. పౌరులకు సూచించిన అమెరికా

Advertiesment
భారత్‌, చైనాకు వెళ్ళొద్దు.. పౌరులకు సూచించిన అమెరికా
, శనివారం, 8 ఆగస్టు 2020 (19:16 IST)
అమెరికాలో కరోనా కారణంగా అమలవుతున్న లెవెల్-4 ఆరోగ్య హెచ్చరికలను ఎత్తివేసి లెవెల్-3 సూచనలు అమలు చేస్తోంది. దీంతో ఆ దేశ పౌరులకు సూచించే  ప్రయాణ మార్గదర్శకాలను సైతం సవరించింది. అయినప్పటికీ భారత్, చైనా, మరో 50 దేశాలకు లెవెల్-4 ప్రయాణ సూచనలను కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్‌కు, చైనాకు వెళ్ళొద్దని అమెరికా తన పౌరులకు సూచించింది.
 
మార్చి-19 నుండి దాదాపు అన్ని దేశాల రాకపోకలు నిలిపివేసిన అమెరికా తాజా నిర్ణయంతో కొన్ని విదేశీ ప్రయాణాలకు అనుమతులు ఇచ్చింది. కొన్ని దేశాలలో వైరస్ తీవ్రత తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ తీవ్రత తగ్గని దేశాలకు మాత్రం ఆంక్షలు విధించింది. కరోనా వైరస్ తీవ్రత కారణంగా మార్చి 19 నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణీకులకు లెవల్ -4 సూచనను అమెరికా జారీ చేసింది.
 
ప్రస్తుతం అమెరికాలో మూడో స్థాయి సూచన కొనసాగుతోంది. ఈ సమయంలో వైరస్ తీవ్రత అధిగంగా వున్న దాదాపు 50 దేశాలకు మాత్రం అమెరికన్లు ప్రయాణించకూడదని ప్రకటించింది. ఈ జాబితాలో భారత్, చైనా, ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, సిరియా, సౌదీ అరేబియా, రష్యా, మెక్సికో, ఈజిప్టు వంటి దేశాలున్నాయి. 
 
ఇకపోతే.. అమెరికాలో కోవిడ్ మహమ్మారి తీవ్రత కొనసాగుతోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 50లక్షలకు చేరవైనాయి. 60వేల మంది మృత్యువాతపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా కోటి 90లక్షల మందికి వైరస్ సోకగా.. ఇప్పటికే ఏడు లక్షల 10వేల మంది ఈ వైరస్‌కు మృతి చెందారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాలుగు రోజులు జ్వరం వస్తే తక్షణం ఆసుపత్రిలో చేరండి: ఏపీ ప్రభుత్వం