Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సూర్యరశ్మితో మురికి నీరు కూడా స్వచ్ఛమైన నీరుగా మారిపోద్దట.. బయోఫోమ్ రెడీ!

సూర్యరశ్మితో మన శరీరానికి కావాల్సిన డి విటమిన్ లభ్యమవుతుందని అందరికీ తెలిసిందే. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలైనా సూర్యరశ్మి శరీరానికి తగిలేలా చూసుకుంటే.. ఎముకల బలానికి కావలసిన డి విటమిన్‌ను పొందవచ్చు. డి

Advertiesment
Dirty to drinkable
, గురువారం, 28 జులై 2016 (09:31 IST)
సూర్యరశ్మితో మన శరీరానికి కావాల్సిన డి విటమిన్ లభ్యమవుతుందని అందరికీ తెలిసిందే. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలైనా సూర్యరశ్మి శరీరానికి తగిలేలా చూసుకుంటే.. ఎముకల బలానికి కావలసిన డి విటమిన్‌ను పొందవచ్చు. డి విటమిన్‌ అనేది శరీరానికి కాల్షియం గ్రహించే శక్తినిస్తుంది. సూర్యకాంతి శరీరంపై సూర్య కాంతి పడకపోతే.. క్యాల్షియం లోపిస్తుంది. ఫలితంగా శరీరం దృఢత్వాన్ని కోల్పోతుంది. శరీరంలో క్యాల్షియానికి భారీకాయానికీ సంబంధముంది. 
 
ఒబిసిటీకి క్యాల్షియంకు లింకుంది. ఏసీ ఉన్న ఆఫీసుల్లో పనిచేసే వారు ఊబకాయం బారినపడటానికి, వివిధ రకాల అనారోగ్యాల బారిన పడటానికి కారణం కూడా ఇదే. వారిపై ఎండ తగలకపోవడమే విటమిన్ డి లోపంతో పాటు క్యాల్షియం అందకపోవడం. శరీరం మీద ఎంతగా ఎండ పడితే ఆరోగ్యాన్ని అంతగా పొందవచ్చనినని వైద్యుల సలహా. అలాంటి సూర్యరశ్మితో మురికి నీరైనా స్వచ్ఛమైన నీరుగా మారిపోతుందని వాషింగ్టన్‌ యూనివర్సిటీకి చెందిన భారత్ సంతతి ప్రొఫెసర్‌ శ్రీకాంత సింగమనేని వెల్లడించారు.
 
సూర్యరశ్మి ద్వారా బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే సెల్యులోజ్‌‌ గ్రాఫీన్‌ ఆక్సైడ్‌ పదార్థం.. ఎలాంటి మురికి నీటినైనా.. స్వచ్ఛమైన నీరుగా మారుస్తుంది. మురికి, ఉప్పు నీటిని సూర్యరశ్మి సాయంతో శుద్ధి చేసే కొత్త పద్ధతిని కనుగొన్నట్లు శ్రీకాంత సింగమనేని తెలిపారు. బ్యాక్టీరియా ఉత్పత్తి చేసిన సెల్యులోజ్‌, గ్రాఫీన్‌ ఆక్సైడ్‌ పదార్థాలను ఉపయోగించి తాము సరికొత్త బయోఫోమ్‌ను రూపొందించామన్నారు. 
 
తెల్లటి నురగలా, రెండు పొరలుగా ఉండే ఈ బయోఫోమ్‌లో కిందిపొర స్పాంజిలా పనిచేసి.. మురికి నీటిని పైపొర వద్దకు పంపుతుంది. పైపొర ఎండకు వేడెక్కడం వల్ల నీరు ఆవిరవుతుంది. ఆ నీటి ఆవిరిని సేకరించి, చల్లబర్చుకుంటే చాలు.. స్వచ్ఛమైన తాగునీరు సిద్ధమైనట్లేనని సింగమనేని తెలిపారు. ఈ బయోఫోమ్‌ను తయారు చేసేందుకు పెద్దగా ఖర్చుకాదన్నారు. ఈ బయోఫోమ్ భారత్ వంటి దేశాలకు బాగా ఉపయోగపడుతుందని సింగమనేని వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను ఒప్పుకుంటేనే రేప్ చేశాడు.. 30 యేళ్ళ రేపిస్టుతో 23 యేళ్ల బాధితురాలి సెటిల్మెంట్!