Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెద్ద నోట్ల రద్దు.. మోడీదే తప్పంతా.. భారతదేశం ఎటుపోతుందో?: స్టీవ్ హెచ్ హంకీ

పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీపై అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికా ఆర్థిక శాస్త్రవేత్త స్టీవ్ హెచ్ హంకీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చ

పెద్ద నోట్ల రద్దు.. మోడీదే తప్పంతా.. భారతదేశం ఎటుపోతుందో?: స్టీవ్ హెచ్ హంకీ
, మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (11:51 IST)
పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీపై అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికా ఆర్థిక శాస్త్రవేత్త స్టీవ్ హెచ్ హంకీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ఎటుపోతుందో ఎవరికీ తెలీదని మోడీ తెలిపారు.

నరేంద్రమోడీ చేపట్టిన డీమోనిటైజేషన్‌ చేతగానితనమేనని మోడీ తెలిపారు. మోడీ ప్రకటించిన డీమోనిటైజేషన్‌ను అమలు చేసేంతగా భారత్‌లో మౌలికసదుపాయాలు లేవని స్టీవ్ హెచ్ చెప్పారు. ఆది నుంచీ నోట్లరద్దు వ్యవహారం గందరగోళంగానే సాగిందని ట్విటర్‌లో వ్యాఖ్యానించిన స్టీవ్ ఈ విషయం మోడీ గుర్తెరిగి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
 
ఇదిలా ఉంటే.. దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్ల వెనుక ప్రపంచ పెద్దన్న అమెరికా హస్తం ఉన్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అమెరికా చెప్పినట్టుగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు.. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌, ఆర్థిక శాఖ తలాడించినట్టు ఆసియా పసిఫిక్‌ రీసెర్చ్‌ డాట్‌ కామ్‌ అనే సంస్థ 'దాచిపెట్టిన బహిరంగ రహస్యం: భారత చేపట్టిన క్రూరమైన నోట్ల రద్దు ప్రాజెక్టు వెనక వాషింగ్టన్‌' పేరుతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. 
 
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం భారత తీసుకోవడానికి ముందు, తెరవెనుకా, తెరపైనా ఏడాది కాలంగా జరుగుతున్న 'ఏర్పాట్లు', ఈ మొత్తం ప్రక్రియలో కీలక పాత్రధారులు, ఈ నిర్ణయం వెనక అసలు ప్రయోజనాలు, లబ్దిదారుల వివరాలను ఈ కథనం వెల్లడించిన సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెంటిలేటర్‌పై ఉన్న పార్టీకి ఆశా"కిరణం"... రాహుల్‌తో చర్చలు...