Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐస్‌లాండ్ వెడ్డింగ్ షూట్: హెలికాప్టర్ వధువు తలపై వెళ్తుండగా క్లిక్.. అంతలోనే రెక్కల్లో చిక్కుకుపోయిన..?

అట్టహాసంగా పెళ్లి చేసుకోవాలనుకున్న చైనా దంపతులు.. ఇక ఫోటో షూట్ కోసం ఐస్‌లాండ్‌‌కు వెళ్లారు. వెరైటీ ఫోజుల్లో నూతన వధూవరులను తన కెమెరాలో అద్భుతంగా బంధించాడు ఉత్తమ వెడ్డింగ్‌ ఫోటోగ్రాఫర్లలో ఒకరైన కెమెరా

Advertiesment
Daring wedding shoot
, గురువారం, 28 జులై 2016 (13:49 IST)
అట్టహాసంగా పెళ్లి చేసుకోవాలనుకున్న చైనా దంపతులు.. ఇక ఫోటో షూట్ కోసం ఐస్‌లాండ్‌‌కు వెళ్లారు. వెరైటీ ఫోజుల్లో నూతన వధూవరులను తన కెమెరాలో అద్భుతంగా బంధించాడు ఉత్తమ వెడ్డింగ్‌ ఫోటోగ్రాఫర్లలో ఒకరైన కెమెరా మెన్ లెంగ్‌. చివర్లో చిట్టచివరన నదీ పరివాహక ప్రాంతంలో జరిగిన ఫోటోషూట్‌ మాత్రం పెళ్లి కూతురికి చుక్కలు చూపించింది. 
 
నదీతీరంలో హెలీకాఫ్టర్‌ ఎగురుతున్న బ్యాగ్రౌండ్‌లో వధువు ఫోటో తీయాలని లెంగ్‌ ఫిక్సయ్యాడు. అందుకు తగినట్టుగానే కోస్టల్‌ గార్డ్‌ హెలీకాఫ్టర్‌ను అద్దెకు తీసుకున్నారు. తెల్లటి దుస్తులు ధరించి వెయిల్‌ ముఖాన్ని కప్పుకునే చున్నీ లేదా దుపట్టా లాంటిది పట్టుకున్న పెళ్లి కూతురు తలమీదుగా హెలీకాఫ్టర్ వెళ్తున్నప్పుడు కెమెరా క్లిక్‌మనిపించాలనుకున్నాడు. కానీ హెలీకాఫ్టర్ వధువు తలపైకి రాగానే సమస్య మొదలైంది. హెలీకాఫ్టర్‌ సరాసరి తలపైకి వచ్చేసరికి, ఆ గాలి ఉధృతికి వధువు వణికిపోయింది. 
 
జుట్టుచెరిగిపోయి, ముఖాన దుమ్ముపట్టి, కిందపడబోయింది. అంతేగాకుండా వధువు హెలీకాఫ్టర్ రెక్కల్లో ఇరుక్కుపోయింది. అంతే ఆ సమయంలో పైలెట్ చాకచక్యంగా వ్యవహరించి పెద్ద ప్రమాదం నుంచి గట్టెక్కించాడు. దీంతో బతుకు జీవుడా అంటూ ఇంటికి పయనమైంది. కానీ అద్భుతమైన ఫోటోలు తీసిన లెంగ్ తీరును వధూవరులు ఇద్దరూ ప్రశంసించారు. ఇంకా పెను ప్రమాదం నుంచి తప్పించిన పైలెట్‌ను కొనియాడారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ పిల్లలు తనకు పుట్టలేదన్న అనుమానంతో చంపేశాడు.. ఆ కసాయిని కోర్టు ఉరితీయమంది!